HomeతెలంగాణVarun Tej Health Update: అన్నయ్యకు సర్జరీ పూర్తయింది... త్వరగా కోలుకోవాలి అంటూ నిహారిక ట్వీట్...

Varun Tej Health Update: అన్నయ్యకు సర్జరీ పూర్తయింది… త్వరగా కోలుకోవాలి అంటూ నిహారిక ట్వీట్ …!

హైద‌రాబాద్‌, క్రైమ్ మిర్ర‌ర్: టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం తన కొత్త సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సమయంలో ఆయనకు అనుకోని ప్రమాదం జరిగింది. రాబోయే స్పోర్ట్స్ డ్రామా సినిమా భారి కోసం ప్రాక్టీస్ చేస్తూ ఉండగా, ఆయన మోకాలికి గాయం అయింది. ముఖ్యంగా వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగిందని సమాచారం.

ఈ గాయం కారణంగా వరుణ్ తేజ్ వెంటనే.. ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. డాక్టర్లు ఆయనకు చిన్న శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటూ కోలుకుంటున్నారని సమాచారం. ఈ వార్త అభిమానులను కొంత ఆందోళనకు గురి చేసింది.

ఈ విషయాన్ని ఆయన సోదరి నిహారిక కొణిదెల తన సోషల్ మీడియాలో అధికారికంగా వెల్లడించారు. ఆమె “అన్న వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో తీవ్రమైన మోకాలి గాయం అయ్యింది. ఆయనకు సర్జరీ విజయవంతంగా జరిగింది. ప్రస్తుతం ఆయన డాక్టర్ల పర్యవేక్షణలో కోలుకుంటున్నారు,”అంటూ రాసుకోవచ్చింది.

“ఆయన త్వరగా పూర్తిగా కోలుకుంటారని మేము ఆశిస్తున్నాము. ఈ సమయంలో మీరు చూపుతున్న ప్రేమ, ఆప్యాయత, మద్దతుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు,”అని కూడా తెలిపారు నిహారిక.

ఈ ప్రకటనతో అభిమానులకు కొంత ఉపశమనం లభించింది. వరుణ్ తేజ్ ఆరోగ్యం గురించి స్పష్టత రావడంతో..ఆయన త్వరగా తిరిగి షూటింగ్‌కు వస్తారని అందరూ ఆశిస్తున్నారు.

భారి సినిమా ఒక స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్నట్టు సమాచారం. ఇందులో వరుణ్ తేజ్ కొత్త లుక్‌లో కనిపించనున్నాడు. ఈ సినిమా కోసం ఆయన ప్రత్యేకంగా ఫిట్‌నెస్ ట్రైనింగ్ తీసుకుంటూ, వాలీబాల్ నేర్చుకుంటున్న సమయంలో ఈ గాయం జరిగింది.

ఈ ప్రాజెక్ట్‌ను నిహారిక కొణిదెల నిర్మిస్తున్నారు. ఆమె ఇప్పటికే కమిటీ కుర్రోళ్లు అనే సినిమాతో నిర్మాతగా పరిచయం అయ్యింది. ఆ తర్వాత రాకాసా అనే సినిమాను కూడా నిర్మించింది. ఇప్పుడు తన అన్నతో కలిసి ఈ భారీ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నారు. సంక్రాంతి పండుగకు ఈ సినిమా విడుదల కావాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే వరుణ్ తేజ్ గాయం కారణంగా షూటింగ్ షెడ్యూల్‌లో మార్పులు రావచ్చు. అయినా కూడా టీమ్ ఈ సినిమాను సమయానికి పూర్తి చేయడానికి కృషి చేస్తోంది.

తాజావార్తలు