Homeవైరల్Mrunal Thakur: భర్తను చంపేసే భార్యగా ముద్ర వేసేశారు...మృణాల్ ఠాకూర్...!

Mrunal Thakur: భర్తను చంపేసే భార్యగా ముద్ర వేసేశారు…మృణాల్ ఠాకూర్…!

హైద‌రాబాద్‌, క్రైమ్ మిర్ర‌ర్ : టాలీవుడ్‌లో చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఆమె నటించిన సినిమాలు అన్నీ కూడా ఎమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటాయి. అందుకే ఆమెకు.. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.

మృణాల్‌కు తెలుగు ప్రేక్షకుల్లో భారీ గుర్తింపు తీసుకువచ్చిన సినిమా సీతారామం. ఈ సినిమాలో ఆమె నఠనకు ఎన్నో ప్రశంసలు వచ్చాయి. అయితే ఈ సినిమా చివర్లో హీరో దుల్కర్ సల్మాన్ పాత్ర చనిపోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఆమె కెరీర్‌లో ఒక ముఖ్యమైన మలుపు అయింది.

అలాగే హిందీలో వచ్చిన జెర్సీ సినిమాలో కూడా మృణాల్ నటించింది. ఇందులో హీరోగా నటించిన షాహిద్ కపూర్ పాత్ర కూడా చివర్లో మరణిస్తుంది. ఈ సినిమా కూడా మంచి స్పందన అందుకుంది.

ఇప్పుడు తాజాగా వచ్చిన డాకాయిట్ సినిమాలో మృణాల్ నటించి ఆకట్టుకుంది. ఇందులో హీరోగా కనిపిస్తున్న అడివి శేష్ పాత్ర కూడా త్యాగంతో ముగుస్తుందని సమాచారం. ఇలా వరుసగా ఆమె సినిమాల్లో హీరోలు చనిపోవడం ఒక ప్రత్యేక విషయంగా మారింది.

హజ్బండ్ మర్డరర్!

ఈ విషయంపై మృణాల్ మాట్లాడుతూ.. “నా సినిమాల్లో హీరోలు చివర్లో చనిపోతుంటారు. అందుకే నా ఫ్రెండ్స్ నన్ను ‘హజ్బండ్ మర్డరర్’ అని పిలుస్తారు” అని నవ్వుతూ చెప్పింది.

ఆమె ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు కూడా ఈ విషయాన్ని సరదాగా తీసుకుంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇలా మృణాల్ ఠాకూర్ చేసిన సినిమాల్లో ప్రేమ కథలు ఎక్కువగా విషాదంగా ముగుస్తున్నాయి. అయినప్పటికీ, ఆ సినిమాలు మంచి విజయాలు సాధించడంతో ఆమెకు మంచి పేరు వచ్చింది. తన పాత్రల ద్వారా ప్రేక్షకులను కదిలించగలిగే నటి అని మృణాల్ మళ్లీ మళ్లీ నిరూపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు