Homeతెలంగాణఎన్నికల నియమావళి పాటించాలి

ఎన్నికల నియమావళి పాటించాలి

  • ర్యాలీల‌కు, బ‌హిరంగ స‌భ‌ల‌కు అనుమ‌తులు పొందాలి
  • డిఎస్పీ వెంకటేశ్వర్లు

మహబూబ్ నగర్, క్రైం మిర్ర‌ర్ః

మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో పోటిలో ఉన్న అభ్య‌ర్థులంద‌రూ ఎన్నిక‌ల నియామ‌వ‌ళిని పాటించాల‌ని డీఎస్‌పీ వెంక‌టేశ్వ‌ర్లు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్, భూత్పూర్, దేవరకద్ర మున్సిపాలిటీల పరిధిలో పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ ప్రచార నిమిత్తం వినియోగించే వాహనాలకు సంబంధించి ముందుగా సంబంధిత మున్సిపల్ కమిషనర్ అనుమతి తీసుకోవాలని కోరారు.

ర్యాలీ, మైక్ ప‌ర్మిష‌న్‌,బ‌హిరంగ స‌భ‌ల‌కు సంబంధించి అనుమ‌తులు మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, డీఎస్పీ కార్యాల‌యంలో పొందాల‌ని స్ప‌ష్టం చేశారు.

అనుమ‌తులు లేకుండా బ‌హిరంగ స‌భ‌లు, మైక్‌ల‌తో ప్ర‌చారం నిర్వ‌హించ‌రాద‌ని హెచ్చ‌రించారు.

లేని యెడ‌ల ఎన్నిక‌ల సంఘం నిబంధ‌న‌ల ప్ర‌కారం చ‌ట్ట‌రీత్య క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు.

అభ్య‌ర్థులంద‌రూ ఎన్నిక‌లు శాంతియుతంగా, నిబంధ‌న‌ల ప్ర‌కారం జ‌రిగేలా పోలీసుశాఖ‌కు స‌హ‌క‌రించాల‌ని కోరారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు