Homeక్రీడలువైభవ్ సూర్య వంశి పై తన తండ్రి సంచలన వ్యాఖ్యలు?

వైభవ్ సూర్య వంశి పై తన తండ్రి సంచలన వ్యాఖ్యలు?

క్రైమ్ మిర్రర్,స్పోర్ట్స్ న్యూస్ :- వైభవ్ సూర్యవంశి 14 సంవత్సరాలకే క్రికెట్ చరిత్రలో ఉన్నటువంటి అన్ని రికార్డులను కూడా సమం చేస్తూ లేదా దాటి వేస్తూ అందరి దృష్టిలో పడ్డారు. వయసు 14 సంవత్సరాలే కానీ ఆట తీరు చూస్తుంటే రోహిత్ శర్మ అలాగే రసల్ టైప్ లో విధ్వంసకరంగ ఆటగాడిగా రాణిస్తున్నారు. ఇక తాజాగా అండర్-19 వరల్డ్ కప్ లో కూడా వైభవ్ సూర్యవంశి కేవలం 75 బంతుల్లోనే 151 పరుగులు చేసి ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించారు. ఈ తరుణంలోనే తన తండ్రి సంజీవ్ తన బిడ్డ వైభవ్ పై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మొదటగా వరల్డ్ కప్ లో అద్భుతంగా రాణించినటువంటి వైభవ్ ను ప్రశంసించారు. ఆ తరువాత నా కుమారుడి ఆట చూస్తుంటే చాలా గర్వంగా ఉంది అని.. అయితే ఫైనల్ మ్యాచ్ లో ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా ఆడారు అని ప్రశంసించారు. కానీ వైభవ్ సూర్యవంశీ టెస్ట్ క్రికెట్ ఆడనంత వరకు కూడా అతడిని పెద్ద క్రికెటర్ గా చూడను అని తన మనసులోని మాట చెప్పేశారు. వైభవ్ సూర్యవంశంకి ఇది కేవలం ఆరంభం మాత్రమే అంటూ భవిష్యత్తులో తను ఇంకా సాధించాల్సింది ఎంతో ఉంది అంటూ పేర్కొన్నారు. కేవలం తన కుమారుడిని చూసి బీహార్ లో చాలామంది పిల్లలు కూడా క్రికెట్ వైపు వచ్చే అవకాశం కూడా ఉంది అని తెలిపారు.

Read also : వారంలో ఒక్కరోజు ఫోన్‌కు దూరంగా ఉంటే ఏమవుతుందో తెలుసా?

Read also : పాఠశాలలో ఉపాధ్యాయుడి కామచేష్టలు.. దేహశుద్ధి చేసిన గ్రామస్తులు

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు