Homeఆంధ్ర ప్రదేశ్తిరుమలలో అవినీతి అధికారి...! ఏసీబీ తనిఖీలతో గుట్టు రట్టు ...

తిరుమలలో అవినీతి అధికారి…! ఏసీబీ తనిఖీలతో గుట్టు రట్టు …

  • రూ.100 కోట్లకు పైగా అక్రమస్తులతో టీటీడీ డిప్యూటీ ఈవో మెండు లోకనాథం

 

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ జూలు విదిల్చింది. 100 కోట్ల రూపాయల అవినీతి అధికారిని పట్టుకుంది. ఇప్పటివరకు తెలంగాణ ఏసీబీ మాత్రమే దూకుడుగా వ్యవహరిస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు ఆ వంతు ఏపీ ఏసీబీకి రావడం విశేషం. కలియుగ దైవం తిరుమల శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో మెండు లోకనాథం నివాసం తో పాటు ఆయనకు సంబంధించిన పలు ప్రాంతాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం ఉదయం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడా పెట్టారనే పక్కా సమాచారంతో దాడులు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ బృందాలు.. తిరుపతిలోని పెద్ద కాపు లే అవుట్ లో ఉన్న లోకనాథం ప్రధాన నివాసం పై దాడి చేశారు. దీంతో భారీగా అక్రమ ఆస్తులు బయటపడినట్లు తెలుస్తోంది.

ఏకకాలంలో ఐదు చోట్ల…

Also Read:వాహనం సీటు కింద రహస్య అర.. రూ.1.44 కోట్ల నగదు స్వాధీనం

ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో అధికారుల బృందం ఉదయం 6 గంటల నుంచి ఏకకాలంలో దాడులు చేసింది. మొత్తం ఐదు వేరువేరు ప్రాంతాల్లో తనిఖీలు ప్రారంభించారు. తిరుమలలో ఉన్న లోకనాథం కార్యాలయం తో పాటు తిరుపతిలోని ఆయన ఇద్దరు బావమరుదుల నివాసాలు, ఏర్పేడు మండలం చెల్లూరు లోని ఆయన సోదరుడు ఇంటిపై కూడా ఏసీబీ అధికారులు ఒకేసారి సోదాలు జరిపారు. తిరుమల క్షేత్రస్థాయిలో కీలక పదవిలో ఉంటూ అక్రమార్జనకు పాల్పడ్డారని ఏసీబీకి సమాచారం అందింది. అందుకే విస్తృతంగా తనిఖీలు చేపట్టింది. కీలక ఆస్తుల పత్రాలు, నగదు, బ్యాంక్ లాకర్లు, బాండ్లు, వివిధ రంగాల్లో పెట్టిన అక్రమ పెట్టుబడులకు సంబంధించిన పత్రాలు కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

సరికొత్త సంచలనం…

Also Read:కొండపోచమ్మ రిజర్వాయర్‌లో మునిగి 18 ఏళ్ల విద్యార్థి మృతి

తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోనే ఒక అక్రమ అధికారి అవినీతి పర్వం వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల పవిత్రతను కాపాడడంతో పాటు టీటీడీలో అవినీతిపై ఉక్కు పాదం మోపుతామని స్పష్టం చేసింది. గతంలో శ్రీవారి ఆలయ విధుల్లో ఉన్నప్పుడు అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు వచ్చిన ఆరోపణలపై లోతుగా విచారణ జరిపిన అధికారులు.. ఈ తాజా చర్యలకు దిగినట్లు తెలుస్తోంది.. ప్రస్తుతం విస్తృత తనిఖీలు కొనసాగుతుండగా.. లభ్యమైన మొత్తం ఆస్తుల విలువ, ల్యాండ్ డాక్యుమెంట్లు, డిపాజిట్ల వివరాలపై సాయంత్రానికి ఏసీబీ అధికారులు పూర్తి స్పష్టతతో కూడిన ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. అధికారుల తనిఖీల్లో పట్టుబడిన ఆస్తులు బహిరంగ మార్కెట్లో 100 కోట్లకు పైగా ఉంటాయన్నది ఒక ప్రచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు