Homeక్రైమ్పెళ్లి జరిగిందని పోక్సో నుంచి మినహాయింపు ఉండదు.. హైకోర్టు స్పష్టత

పెళ్లి జరిగిందని పోక్సో నుంచి మినహాయింపు ఉండదు.. హైకోర్టు స్పష్టత

క్రైమ్ మిర్రర్ : మైనర్ బాలికల రక్షణకు సంబంధించిన కేసులో కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వ్యక్తిగత చట్టాలు, మతపరమైన ఆచారాల ప్రకారం వివాహం జరిగిందనే కారణంతో 18 ఏళ్లలోపు బాలికకు పోక్సో చట్టం నుంచి మినహాయింపు ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. 17 ఏళ్ల బాలికను వివాహం చేసుకున్న వ్యక్తిపై నమోదైన పోక్సో కేసును రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ సెబాస్టియన్ తిరస్కరించారు. మన్నార్‌క్కాడ్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఈ కేసు ప్రస్తుతం పట్టాంబిలోని ఫాస్ట్‌ట్రాక్ స్పెషల్ కోర్టులో విచారణ దశలో ఉంది.

బాలికతో వివాహం జరిగిన సమయంలో ఆమె వయసు 17 సంవత్సరాల ఒక నెల మాత్రమేనని కోర్టు దృష్టికి వచ్చింది. ఇస్లామిక్ వ్యక్తిగత చట్టం, మతపరమైన సంప్రదాయాల ప్రకారం ఆమె తన చట్టబద్ధమైన భార్యేనని నిందితుడు వాదించినట్లు సమాచారం. అయితే మైనర్ బాలిక విషయంలో వివాహానికి సంబంధించిన వ్యక్తిగత చట్టాలు పోక్సో చట్టం అమలుకు అడ్డంకిగా మారవని హైకోర్టు స్పష్టం చేసింది. బాలలపై లైంగిక నేరాల నుంచి రక్షణ కల్పించడమే పోక్సో చట్టం ప్రధాన ఉద్దేశమని పేర్కొంటూ, నిందితుడి పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. దీంతో 18 ఏళ్లలోపు బాలికతో వివాహం జరిగిన సందర్భాల్లో వ్యక్తిగత చట్టాలు లేదా మతపరమైన సంప్రదాయాలను కారణంగా చూపి పోక్సో కేసుల నుంచి తప్పించుకునే అవకాశం లేదన్న అంశంపై ఈ తీర్పు మరోసారి చర్చకు దారితీసింది.
also read :డిప్యూటీ ఈవో ఇంటిపై ఏసీబీ సోదాలు.. టీటీడీలో కలకలం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు