Homeఆంధ్ర ప్రదేశ్డిప్యూటీ ఈవో ఇంటిపై ఏసీబీ సోదాలు.. టీటీడీలో కలకలం

డిప్యూటీ ఈవో ఇంటిపై ఏసీబీ సోదాలు.. టీటీడీలో కలకలం

క్రైమ్ మిర్రర్ : తిరుమల శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో మెండు లోకనాథానికి సంబంధించిన ఆస్తుల వ్యవహారంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దృష్టి సారించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదు చేసి, బుధవారం ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. తిరుపతి నగరంలోని పెద్దకాపు లేఅవుట్‌లో ఉన్న లోకనాథం నివాసంలో ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్‌రావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు తనిఖీలు చేపట్టాయి. ఇంట్లో లభించిన ఆస్తులకు సంబంధించిన పత్రాలు, స్థిరాస్తులు, చరాస్తుల వివరాలు, బ్యాంకు ఖాతాలు, లాకర్లు, బంగారు ఆభరణాలకు సంబంధించిన రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.

లోకనాథం నివాసంతో పాటు తిరుపతిలో ఉన్న ఆయన ఇద్దరు బావమరుదుల ఇళ్లలోనూ ఏసీబీ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. అలాగే ఏర్పేడు మండలం చెల్లూరు గ్రామంలోని లోకనాథం సోదరుడి నివాసంలోనూ అధికారులు సోదాలు చేపట్టారు. ఇదే సమయంలో తిరుమలలోని శ్రీవారి ఆలయ ప్రాంగణంలో ఉన్న లోకనాథం అధికారిక కార్యాలయంలో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సంబంధిత రికార్డులు, పత్రాలను పరిశీలిస్తూ అవసరమైన సమాచారాన్ని సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.

లోకనాథం భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరుగుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ తనిఖీలు చేపట్టడంతో టీటీడీ వర్గాల్లో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. సోదాలు పూర్తయిన తర్వాత అధికారులు స్వాధీనం చేసుకున్న పత్రాలు, ఆస్తుల వివరాలు, తదుపరి చర్యలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
also read : ఆరేళ్ల తర్వాత దిశా కేసులో బిగ్ ట్విస్ట్.. సీబీఐ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు