క్రైమ్ మిర్రర్ : హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని శంషాబాద్–రాజేంద్రనగర్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నకిలీ నోట్ల తయారీకి పాల్పడుతున్న ముగ్గురిని అరెస్టు చేశారు. రమావత్ రాము, రమావత్ మోతీలాల్, రమావత్ గాంధీలను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసుల దర్యాప్తులో ఈ ముఠా వద్ద నుంచి మొత్తం రూ.2.91 లక్షల విలువైన నకిలీ కరెన్సీ గుర్తించినట్లు తెలిపారు. సోషల్ మీడియాలో లభించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని నిందితులు ఈ వ్యవహారంలోకి దిగినట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు పేర్కొన్నారు.
తయారు చేసిన నకిలీ నోట్లలో సుమారు రూ.10 వేల విలువైన కరెన్సీని వైన్‌షాపులు, కూరగాయల మార్కెట్లలో రాత్రి వేళల్లో చలామణీ చేసినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. ముఠాను అరెస్టు చేయడంతో నగరంలో నకిలీ కరెన్సీ చలామణీకి జరుగుతున్న ప్రయత్నాన్ని అడ్డుకున్నామని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనతో సోషల్ మీడియాలో నకిలీ నోట్ల తయారీ వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన కంటెంట్‌పై మరింత నిఘా అవసరమని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి వీడియోలను నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలపై ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ నిర్వాహకులకు లేఖలు రాసి వివరణ కోరనున్నట్లు పోలీసులు తెలిపారు.
also read : పెళ్లి జరిగిందని పోక్సో నుంచి మినహాయింపు ఉండదు.. హైకోర్టు స్పష్టత
