Homeతెలంగాణపోస్టర్ల వార్!

పోస్టర్ల వార్!

-కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై అధికార పార్టీ సంబరాలు
-దెబ్బతీసేందుకు ప్రధాన పట్టణాల్లో వ్యంగ్య పోస్టర్లు
-గులాబీ పార్టీ పని అని అనుమానం
-కౌంటర్ గా కాంగ్రెస్ గత పదేళ్ల వైఫల్యాలపై పోస్టర్లు
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో
:-
తెలంగాణలో వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకుంది కాంగ్రెస్ సర్కార్. తమ పాలనలోని విజయాలు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు భారీగా నివేదికలు విడుదల చేసింది. పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటోంది. మరోవైపు ఈ వేడుకల మూడ్ ను దెబ్బతీసేందుకు గులాబీ పార్టీ రంగంలోకి దిగింది. ఇప్పటివరకు ప్రభుత్వం పై వ్యతిరేకత పెంచేందుకు సోషల్ మీడియాను వాడుకున్న గులాబీ పార్టీ శ్రేణులు.. ఇప్పుడు వీధుల్లోకి వచ్చి పోస్టర్ల దాడికి శ్రీకారం చుట్టడం విశేషం.

కాంగ్రెస్ వైఫల్యాలను ప్రశ్నిస్తూ..
రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో రహదారులు, చౌరస్తాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వెలసిన వ్యంగ్యాత్మక కార్టూన్ పోస్టర్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఆరు గ్యారెంటీలు, రైతు భరోసా, ఉద్యోగాల భర్తీ వంటి అంశాలపై వ్యంగ్యాస్త్రాలు ప్రత్యక్షం చేస్తున్నారు. ఈ పోస్టర్లలో ఎక్కడ భారత రాష్ట్ర సమితి పార్టీ పేరు కానీ.. గుర్తులు గాని ముద్రించడం లేదు. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ సర్కార్ దిగిపోవాలన్న ఆలోచనతో ఎక్కువగా పావులు కదుపుతోంది బి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులు మాత్రమే. కేవలం కేసుల నుంచి తప్పించుకునేందుకు అలా చేస్తున్నారు అనేది స్పష్టం.

ధీటుగా కాంగ్రెస్ జవాబు
మరోవైపు ఈ తరహా ప్రచారాన్ని తిప్పి కొట్టే ప్రయత్నంలో ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. అవి సైతం అదే శైలిని ఎంచుకున్నాయి. మిర్యాలగూడ వంటి కీలక నియోజకవర్గాలతో పాటు పలు పట్టణాల్లో పదేళ్ల గులాబీ పార్టీ పాలనలో జరిగిన అక్రమాలు, కాలేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలు, ఆర్థిక లోటును ఎత్తిచూపుతూ ఎదురు పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. బిఆర్ఎస్ కౌంటర్ వేస్తే తాము రీకౌంటర్ వేస్తామనే తరహాలో కాంగ్రెస్ వైపు నుంచి కూడా పోటీగా పోస్టర్లు వెలుస్తున్నాయి. రెండు ప్రధాన పార్టీలు పాస్టర్ల యుద్ధాన్ని వీధుల దాకా తెచ్చినా.. తామే స్వయంగా పోస్టర్లు వేయిస్తున్నామని ఎవరు బహిరంగంగా చెప్పకపోవడం విశేషం.

మారిన సీన్..
తెలంగాణలో విచిత్ర రాజకీయ పరిస్థితి నెలకొంది. నిన్నటి వరకు కాంగ్రెస్ వర్సెస్ బిజెపి అన్నట్టు పరిస్థితి ఉండేది. పరస్పరం కార్యాలయాలపై దాడులు.. రంగులు పూసుకోవడం వంటివి చేసేవి. కానీ ఇప్పుడు అధికార కాంగ్రెస్ వర్సెస్ ప్రధాన ప్రతిపక్షం బిఆర్ఎస్ అన్నట్టు పరిస్థితి మారింది. ఈ పోస్టర్ వార్ రెండు పార్టీల ముసుగులేని రాజకీయ పోరాటానికి అద్దం పడుతోంది. తమ అధికారిక ముద్ర పడకుండా పోస్టర్ల ద్వారా మైండ్ గేమ్ లు ఆడడం, ప్రజల్లో చర్చను రేకెత్తించడం ఇరు వర్గాల వ్యూహకర్తల ప్రధాన ఉద్దేశం గా కనిపిస్తోంది. ఒకరి వైఫల్యాలను మరొకరు రచ్చకెక్కించే ఈ ప్రక్రియలో పసందైన రాజకీయం నడుస్తోంది తెలంగాణలో..

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు