క్రైమ్ మిర్రర్, పాలిటిక్స్:- జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల పేరుతో ఏర్పాటైన RAW NTR సంస్థ ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ సంస్థ వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయంటూ వస్తున్న ప్రచారాల మధ్య, ఆర్గనైజర్ సాయిరూప్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ సంస్థ పూర్తిగా జూనియర్ ఎన్టీఆర్‌పై ఉన్న అభిమానంతోనే ప్రారంభించామని, ఎలాంటి రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని స్పష్టం చేశారు. గ్రామీణాభివృద్ధి, సేవా కార్యక్రమాలు, సామాజిక బాధ్యతతో ప్రజలకు అండగా నిలవడమే సంస్థ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.సాయిరూప్ మాట్లాడుతూ, ఊరూవాడ కాన్సెప్ట్‌ను జూనియర్ ఎన్టీఆర్‌కు వివరించే అవకాశం వస్తే తప్పకుండా వివరిస్తామని తెలిపారు. ఒకవేళ ఆ ప్రతిపాదనను ఎన్టీఆర్ అంగీకరించకపోతే ఆయన నిర్ణయాన్ని పూర్తిగా గౌరవిస్తామని చెప్పారు. తమ కార్యకలాపాలన్నీ హీరో ప్రతిష్ఠకు భంగం కలగకుండా నిర్వహిస్తున్నామని వెల్లడించారు.
పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన మంత్రి నారా లోకేష్..!
అలాగే ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం నుంచి తమకు ఎలాంటి లీగల్ నోటీసులు అందలేదని సాయిరూప్ తెలిపారు. RAW NTR సంస్థ పూర్తిగా సొంత నిధులతోనే నడుస్తోందని, ఎవరిపైనా ఆర్థికంగా ఆధారపడడం లేదని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 160 కేంద్రాల్లో ఎన్టీఆర్ మీల్స్ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఎన్టీఆర్ పేరు లేదా ఫొటోలను ఉపయోగించి ఎప్పుడూ విరాళాలు సేకరించలేదని స్పష్టం చేశారు.
తమపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ముందుగా జూనియర్ ఎన్టీఆర్ టీమ్‌కే పూర్తి వివరణ ఇచ్చామని సాయిరూప్ వెల్లడించారు. అభిమాన సంఘాలను సంప్రదించే ముందే హీరో కార్యాలయంతో మాట్లాడేందుకు ప్రయత్నించామని, అయితే కొందరు ఉద్దేశపూర్వకంగా ఎన్టీఆర్‌ను కలిసే అవకాశాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని కూడా పేర్కొన్నారు.ఎంత వివాదం జరిగినా జూనియర్ ఎన్టీఆర్ పేరు చెడగొట్టేలా తాము ఎప్పుడూ వ్యవహరించబోమని, హీరోపై తమకు అపారమైన గౌరవం ఉందని సాయిరూప్ మరోసారి స్పష్టం చేశారు. అభిమానుల మధ్య ఐక్యతే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఇదే సందర్భంగా దివంగత అభిమాని శ్యామ్ కుటుంబానికి అందిస్తున్న ఆర్థిక సహాయంపై కూడా వివరాలు వెల్లడించారు. శ్యామ్ సోదరీమణుల ఉన్నత విద్య కోసం అభిమానుల తరఫున ప్రత్యేక సహాయ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.
అయితే RAW NTR సంస్థ ఆవిర్భావం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అభిమాన వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయా అనే చర్చ సోషల్ మీడియాలో కొనసాగుతోంది. ఎన్టీఆర్ చుట్టూ ఉన్న కొందరు వ్యక్తులు తప్పుడు సమాచారం చేరవేస్తున్నారని సాయిరూప్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తి రేకెత్తించాయి. ఈ ఆరోపణల్లో ఎంతవరకు వాస్తవం ఉందనే అంశంపై అధికారికంగా ఎలాంటి స్పష్టత రాలేదు. ప్రస్తుతం మాత్రం RAW NTR వ్యవహారం అభిమాన వర్గాల్లో విస్తృత చర్చకు దారితీస్తోంది.
గుడ్లు, పాలు మాత్రమే కాదు.. ఈ సూపర్ ఫుడ్ ఒక్కటే వాటికీ సమానం!