-
భాగ్యనగరంలో అగ్నిమాపక నిబంధనలు పాటించని భవనాలు ఎన్నో
-
ఇటీవల జోరుగా అగ్ని ప్రమాదాలు
-
విస్తృత తనిఖీలకు జిహెచ్ఎంసి సిద్ధం
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: తెలంగాణ అగ్నిమాపక శాఖ జూలు విదిల్చింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బహుళ అంతస్తులను తనిఖీ చేయనుంది. ఇటీవల అగ్ని ప్రమాదాలు పెరుగుతుండడంతో అసలు నిబంధనలు పాటిస్తున్నారా? లేదా? అని తెలుసుకునేందుకు తనిఖీలు చేయనున్నట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వెనువెంటనే నోటీసులు జారీ చేసేందుకు కూడా సిద్ధపడుతున్నట్లు సమాచారం.
తరచూ అగ్ని ప్రమాదాలు…
Also Read:సీఎం పేరిట డీప్‌ఫేక్ కలకలం.. రంగంలోకి క్రైమ్ బ్రాంచ్
భాగ్యనగరంలో పలు బహుళ అంతస్తుల భవనాలు, గేటెడ్ కమ్యూనిటీలలో ఇటీవల వరుసగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనలను తీవ్రంగా పరిగణిస్తోంది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. అందుకే తెలంగాణ రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల విభాగం తో కలిసి కఠిన చర్యలకు ఉపక్రమించనుంది. నగరంలోని ప్రైవేట్, కమర్షియల్, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లలో అగ్నిమాపక రక్షణ నిబంధనలు సరిగ్గా అమలు జరుగుతున్నాయా? లేదా? అని తేల్చేందుకు విస్తృత స్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించేందుకు అధికారులు కసరత్తు పూర్తి చేశారు.
తనిఖీలు ఇలా…
Also Read: గూడ్స్ రైలు కింద పడి యువకుడు మృతి
భాగ్యనగరంలో త్వరలో ఆకస్మిక తనిఖీలు జరగనున్నాయి. ప్రధానంగా భవనాలకు సంబంధించిన ఫైర్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్, ఆక్యుఫెన్సీ సర్టిఫికెట్ల చెల్లుబాటును పరిశీలించనున్నారు. ప్రమాదం జరిగినప్పుడు తక్షణమే స్పందించాల్సిన ఆటోమేటిక్ ఫైర్ స్పిన్క్లర్లు, స్మోక్ డిటెక్టర్లు, ఫైర్ హౌస్ రీల్స్, అత్యవసర పంపులు సరైన కండిషన్ లో పనిచేస్తున్నాయా? లేదా? అని క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయనున్నారు. నిబంధనలు పాటించిన వారికి అక్కడికక్కడే నోటీసులు జారీ చేయనున్నారు. రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ లకు సైతం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నారు.
నిబంధనలకు తిలోదకాలు…
Also Read:గంజాయి కేసులో మనీలాండరింగ్ కోణం.. రంగంలోకి ఈడీ
నగరంలో బహుళ అంతస్తుల భవనాల నిర్మాణంలో నిబంధనలు పాటించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. జాతీయ భవన నిర్మాణ నిబంధనల ప్రకారం ప్రతి కొన్ని అంతస్తుల మధ్య ఖాళీగా ఉంచాల్సిన స్థలాలను.. అనేక భవనాల్లో క్లబ్ హౌస్ లుగా, వినోద కేంద్రాలుగా, భారీ కార్యాలయాలుగా నిబంధనలకు విరుద్ధంగా మార్చేస్తున్నారు. ఇటువంటి అక్రమ భవనాలను గుర్తిస్తే వాటిని వెంటనే స్వాధీనం చేసుకోవడంతో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడానికి అగ్నిమాపక శాఖ అధికారులు సిద్ధపడుతున్నారు. అయితే ఈ ప్రక్రియ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.
