Homeక్రైమ్విశాఖలో విషాదం.. నేవీ ఉద్యోగి భార్య మృతి

విశాఖలో విషాదం.. నేవీ ఉద్యోగి భార్య మృతి

క్రైమ్ మిర్రర్ : విశాఖపట్నంలోని నౌసేనాబాగ్‌ ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. నేవీ ఉద్యోగి భార్య భవనం పైనుంచి కిందకు దూకి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం.. మృతురాలిని ప్రియాంక వర్మగా గుర్తించారు. ఆమె భర్త దీపక్‌ వర్మ విశాఖపట్నంలోని నేవీ విభాగంలో ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

తమ నివాస సముదాయంలోని 14వ అంతస్తుకు వెళ్లిన ప్రియాంక అక్కడి నుంచి కిందకు పడటంతో తీవ్ర గాయాలై మృతి చెందినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే ఆమె ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై సమాచారం అందుకున్న మల్కాపురం పోలీసులు అక్కడికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. భవన ప్రాంగణంలో లభించిన ఆధారాలను సేకరించడంతో పాటు కుటుంబ సభ్యులు, స్థానికులను విచారిస్తున్నారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు మల్కాపురం పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.
also read : గూడ్స్ రైలు కింద పడి యువకుడు మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు