Homeక్రైమ్గూడ్స్ రైలు కింద పడి యువకుడు మృతి

గూడ్స్ రైలు కింద పడి యువకుడు మృతి

క్రైమ్ మిర్రర్ : మహబూబాబాద్‌ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. రైల్వే పట్టాలపై ఓ యువకుడి మృతదేహం కనిపించడంతో స్థానికంగా కలకలం రేగింది. స్థానికులు, పోలీసుల సమాచారం ప్రకారం.. ఎర్రంశెట్టి దీపక్‌ అనే యువకుడి మృతదేహాన్ని గురువారం తెల్లవారుజామున రైల్వే పట్టాలపై గుర్తించారు. గూడ్స్‌ రైలు కింద పడి అతడు మృతి చెందినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. అయితే దీపక్‌ రైల్వే పట్టాల వద్దకు వెళ్లడానికి గల కారణం ఏమిటన్నది తెలియరాలేదు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా? లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. పోలీసుల విచారణ పూర్తయిన అనంతరం ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
also read : గంజాయి కేసులో మనీలాండరింగ్‌ కోణం.. రంగంలోకి ఈడీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు