Homeక్రైమ్హోటల్‌లో దారుణం.. ప్రియురాలిని కత్తితో పొడిచి హత్య

హోటల్‌లో దారుణం.. ప్రియురాలిని కత్తితో పొడిచి హత్య

క్రైమ్ మిర్రర్ : దేశ రాజధాని ఢిల్లీలో ఓ హోటల్‌లో యువతి హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. ఆమెతో కలిసి హోటల్‌లో ఉన్న యువకుడే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బీహార్‌కు చెందిన శివాని, రాజస్థాన్‌కు చెందిన ప్రకాష్‌ బుధవారం సాయంత్రం లాహోరీ గేట్‌ ప్రాంతంలోని ఓ హోటల్‌లో గది తీసుకుని బస చేశారు. రాత్రి సమయంలో ఇద్దరి మధ్య వివాదం జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రకాష్‌ కత్తితో శివానిపై దాడి చేసినట్లు తెలుస్తోంది.

తీవ్ర గాయాలతో శివాని మృతి చెందగా.. ఘటన అనంతరం ప్రకాష్‌ విషం సేవించి ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు సమాచారం. గురువారం ఉదయం హోటల్‌ సిబ్బంది గదిలో యువతి మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హోటల్‌కు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. గాయాలతో ఉన్న ప్రకాష్‌ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. శివాని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. హత్యకు దారితీసిన కారణాలు, ఇద్దరి మధ్య జరిగిన వివాదానికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికానున్నాయి.
also read : టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్.. ఇంట్లో రూ.5 కోట్ల ఆస్తులు గుర్తించిన ఏసీబీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు