మంచిర్యాల,(క్రైమ్ మిర్రర్): తెలంగాణ యువతకు జపాన్‌లో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా చేపట్టిన విదేశీ ర్యటనను ముగించుకుని తిరిగొచ్చిన మంత్రి, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి శంషాబాద్ విమానాశ్రయంలో కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు.మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు నాయకులు యనను కలిసి పూలగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు.
Also Read:‘రంభ ఊర్వశి మేనక’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో విష్ణుప్రియ సందడి.. ఆ కామెంట్‌కు అంతా నవ్వాల్సిందే!
విద్యార్థుల భవిష్యత్తు కోసం విదేశీ సంస్థలతో చర్చలు జరపడం ప్రశంసనీయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో క్యాతనపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు వొడ్నాల శ్రీనివాస్, మాజీ అధ్యక్షులు పల్లె రాజు, గోపు రాజం, నాయకులు పనస రాజు, యాకుబ్ అలీ, అందుగుల మల్లేష్, గోపతి బానేష్, భైర మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
Also Read:‘ఇలాంటి సినిమాలు చేయడం కంటే తప్పుకోవడమే బెటర్’.. తాప్సీ పన్ను సంచలన వ్యాఖ్యలు
