భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకరిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ‘స్వింగ్ కింగ్’ మహమ్మద్ షమీ నేడు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. పిచ్ ఎలాంటిదైనా సరే, కొత్త బంతితో అద్భుతమైన స్వింగ్ రాబట్టడంలోనూ, పాత బంతితో రివర్స్ స్వింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను గడగడలాడించడంలోనూ షమీది అందె వేసిన చేయి. వన్డే ప్రపంచకప్ టోర్నీలలో అంటేనే ఆయన చెలరేగిపోతూ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తారు. కేవలం 18 మ్యాచ్‌ల్లోనే ఏకంగా 55 వికెట్లు తీసి తన సత్తా ఏంటో నిరూపించారు.ప్రస్తుతం జాతీయ జట్టుకు కొంతకాలంగా దూరమైనప్పటికీ, షమీ పట్టుదల మాత్రం ఎక్కడా తగ్గలేదు. దేశవాళీ క్రికెట్లో అదరగొడుతూ, మళ్లీ భారత జట్టులోకి రీఎంట్రీ ఇవ్వడం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. బీసీసీఐ సెలెక్టర్ల దృష్టిలో పడేందుకు దేశవాళీ టోర్నీల్లో తన అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తూ తలుపు తడుతున్నారు. మైదానంలో ఆయన కఠిన శ్రమ, పట్టుదల యువ ఆటగాళ్లకు ఎప్పుడూ స్ఫూర్తిదాయకమే.క్రిడారంగంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్న షమీ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, సహచర క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. త్వరలోనే ఆయన పూర్తి ఫిట్నెస్తో తిరిగి టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చి మరిన్ని విజయాలు అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న నిత్యావసర సరుకుల ధరలు!
తిరుమలలో అవినీతి అధికారి…! ఏసీబీ తనిఖీలతో గుట్టు రట్టు …
