యువతను ఆకట్టుకునే కథాంశంతో తెరకెక్కిన ‘రోమాంచకం’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్‌కుమార్ జంటగా నటించిన ఈ చిత్రానికి పెయిడ్ ప్రీమియర్స్ అనంతరం మంచి స్పందన లభిస్తోంది. తాజాగా సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ చిత్రబృందాన్ని అభినందించారు.
‘రోమాంచకం’ తనకు ఎంటర్టైనింగ్గా, ప్రామిసింగ్‌గా అనిపించిందని మహేశ్‌బాబు పేర్కొన్నారు. సినిమా కోసం దర్శకుడు, నటీనటులు, సాంకేతిక బృందం పెట్టిన శ్రమ, చూపించిన ప్యాషన్ తెరపై స్పష్టంగా కనిపిస్తోందని ప్రశంసించారు. చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
సందీప్ రెడ్డి వంగా సమర్పణలో ఈ సినిమా రూపొందింది. వేణు గోపాల్ రెడ్డి కథను అందించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించారు. వాసుకి వైభవ్ సంగీతం అందించగా.. ఉపేంద్ర లిమాయే, వెంకటేశ్ కాకుమాను, నరేంద్ర రవి, మణి ఏగుర్ల, సాయి సోహన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.
మహేశ్‌బాబు చేసిన ప్రశంసలపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్పందించారు. సినిమాకు సూపర్‌స్టార్ అందించిన ప్రోత్సాహానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే విడుదలకు ముందు ఆసక్తిని పెంచుకున్న ‘రోమాంచకం’.. తాజాగా ప్రేక్షకుల ముందుకు రావడంతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
also read: ‘రంభ ఊర్వశి మేనక’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో విష్ణుప్రియ సందడి.. ఆ కామెంట్‌కు అంతా నవ్వాల్సిందే!
