Homeక్రైమ్భార్య పుట్టినరోజు రోజే భర్త ఆత్మహత్య.. హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగి బలవన్మరణం

భార్య పుట్టినరోజు రోజే భర్త ఆత్మహత్య.. హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగి బలవన్మరణం

భార్య పుట్టినరోజు వేడుకలు జరుగుతున్న సమయంలో ఓ ఐటీ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో విషాదాన్ని నింపింది. దేవినగర్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఖమ్మం జిల్లాకు చెందిన రమేష్‌ (40) తన భార్య రాధికతో కలిసి దేవినగర్‌లో నివాసం ఉంటున్నాడు. సెప్టెంబర్‌ 1న రాధిక పుట్టినరోజు కావడంతో ఆమె కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చారు. కొద్దిసేపటి తర్వాత కుటుంబ సభ్యులు బయటకు వెళ్లగా.. రమేష్‌ మాత్రం ఇంట్లోనే ఉండిపోయాడు.

అర్ధరాత్రి సమయంలో రమేష్‌ తన భార్యకు ఓ సందేశం పంపినట్లు తెలుస్తోంది. ‘పొరపాటు జరిగింది.. సారీ.. గుడ్‌బై’ అంటూ మెసేజ్‌ చేయడంతో ఆమె ఆందోళనకు గురైంది. వెంటనే ఇంటికి చేరుకుని చూడగా.. రమేష్‌ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రమేష్‌ ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.

also read: హైదరాబాద్‌ కంటోన్మెంట్‌లో కలకలం.. ఆర్మీ స్థావరం నుంచి 12 ఆయుధాలు మాయం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు