Homeతెలంగాణసరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో సినీ నటి మాధవీలతపై కేసు నమోదు..!

సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో సినీ నటి మాధవీలతపై కేసు నమోదు..!

  • 14 మంది యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల పై ఎఫ్ఐఆర్ (FIR) నమోదు
  • డిసెంబర్ 30, 2025 (మంగళవారం) ఉదయం 10 గంటలకు పోలీస్ స్టేషన్‌లో హాజరుకావాలని నోటీసులు జారీ

క్రైమ్ మిర్రర్ తెలంగాణా ఇన్వెస్టిగేషన్ బ్యూరో: సినీ నటి మాధవీలతపై హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు  సమాచారం. తాజా వివరాల ప్రకారం.. షిరిడీ సాయిబాబా దేవుడు కాదంటూ సోషల్ మీడియాలో ఆమె చేసిన వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని ఫిర్యాదు అందింది.

 

ఆమె తన పోస్టులలో సాయిబాబాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వచ్చాయి. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదు చేసినట్లు సమాచారం అందింది. మాధవీలతతో పాటు ఈ వివాదాస్పద వ్యాఖ్యలను ప్రోత్సహించిన సుమారు 14 మంది యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేసినట్లు సమాచారం.

 

విచారణలో భాగంగా డిసెంబర్ 30, 2025 (మంగళవారం) ఉదయం 10 గంటలకు పోలీస్ స్టేషన్‌లో హాజరుకావాలని పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది. ఇంతకు ఆమె పోలీస్ స్టేషన్‌లో హాజరు అవుతార లేదా అనేది వేచి చూడాల్సిందే..

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు