Homeతెలంగాణకేటీఆర్ కు అస్వస్థత...!

కేటీఆర్ కు అస్వస్థత…!

  • తీవ్ర జ్వరంతో బాధపడుతున్న గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్

  • పార్టీ శ్రేణుల్లో ఆందోళన

క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: గులాబీ పార్టీ అగ్రనేత కేటీఆర్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. తీవ్రమైన వైరల్ జ్వరం, నువ్వు తరహా లక్షణాలతో అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. వాతావరణ మార్పులు, కాలానుగుణంగా వ్యాపిస్తున్న ఇన్ఫెక్షన్ల ప్రభావంతో ఒక్కసారిగా నీరసం, జ్వరం బారిన పడ్డారు.

దీంతో వైద్యుల పర్యవేక్షణలోకి కేటీఆర్ వెళ్లాల్సి వచ్చింది. ప్రస్తుతానికి ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేక పోయింది.. కానీ వైద్య నిపుణుల సూచనల మేరకు ఆయన ఇంటి వద్ద అవసరమైన పూర్తిస్థాయి చికిత్స తీసుకుంటున్నారు. దీంతో రెండు రోజులపాటు ఆయన రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉండనున్నారు.

  • రెండు రోజుల విరామం..

ఆరోగ్య సమస్యల కారణంగా రోజువారి కార్యక్రమాలకు, వ్యక్తిగత షెడ్యూలకు తాత్కాలిక విరామం ప్రకటించారు కేటీఆర్. నిపుణులైన వైద్యులు అవసరమైన మందులు, పూర్తి విశ్రాంతిని సూచించారని.. శరీరం కోలుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

అయితే ఈ హఠాత్ అస్వస్థత వార్తతో పార్టీ శ్రేణులు ఆందోళనకు గురయ్యాయి. అయితే కేటీఆర్ త్వరగా కోలుకుంటున్నారని.. ఆయన విషయంలో ఇబ్బందులు లేవని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

  • కేటీఆర్ ట్వీట్..

మరోవైపు కేటీఆర్ ట్వీట్ చేశారు. తాను అనారోగ్యానికి గురైన విషయాన్ని పంచుకున్నారు. ఎటువంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని.. మరో రెండు మూడు రోజుల్లో కోలుకొని పూర్తి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటానని చెప్పడంతో శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి.

కొద్ది రోజుల కిందట కేటీఆర్ కుమారుడు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కేసీఆర్ స్వయంగా వెళ్లి మనవడిని పరామర్శించారు. ఇప్పుడు కేటీఆర్ అనారోగ్యం బారిన పడ్డారు. ఆయన త్వరగా కోలుకోవాలని పార్టీ శ్రేణులు ఆకాంక్షిస్తున్నాయి.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు