క్రైమ్ మిర్రర్,హెల్త్ :- సాధారణంగా చలికాలంలో రక్తపోటు (బీపీ) సమస్యలు పెరుగుతాయని అందరికీ తెలిసిందే. అయితే, వర్షాకాలంలో కూడా వాతావరణంలో వచ్చే ఉష్ణోగ్రత మార్పుల వల్ల బ్లడ్ ప్రెషర్ పెరిగే ప్రమాదం పొంచి ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం వాతావరణమే కాకుండా, మన జీవనశైలిలో వచ్చే కొన్ని మార్పులు కూడా ఈ ముప్పును పెంచుతాయని వివరిస్తున్నారు.వర్షాకాలంలో బీపీ పెరగడానికి ప్రధాన కారణాలు ఇవే. వర్షాకాలంలో అకస్మాత్తుగా ఉష్ణోగ్రతలు పడిపోవడం వల్ల రక్తనాళాలు బిగుసుకుపోతాయి. దీని వల్ల గుండె రక్త ప్రసరణ కోసం ఎక్కువ ఒత్తిడిని ఉపయోగించాల్సి వస్తుంది, ఫలితంగా బీపీ పెరుగుతుంది. వర్షాల కారణంగా చాలామంది బయటకు వెళ్లి వాకింగ్ లేదా వ్యాయామాలు చేయడానికి ఇష్టపడరు. దీనివల్ల శారీరక శ్రమ తగ్గి, బరువు పెరగడం, తద్వారా బీపీ సమస్యలు తలెత్తడం జరుగుతుంది. వర్షం పడుతున్నప్పుడు వేడిగా, కారంగా ఉండే ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్ తినడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఈ రకమైన ఆహారంలో ఉప్పు (సోడియం) శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును అమాంతం పెంచేస్తుంది.ఇప్పటికే హైపర్‌టెన్షన్ (అధిక రక్తపోటు) ఉన్నవారిపై ఈ వర్షాకాల వాతావరణం ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. వీరు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.తప్పనిసరిగా క్రమం తప్పకుండా ఇంట్లోనే బీపీని పరీక్షించుకోవాలి.వారంలో కనీసం ఐదు రోజులు ఇంట్లోనే చేయదగిన వ్యాయామాలు (యోగా, స్ట్రెచింగ్ వంటివి) చేయాలి.ఉప్పు, ప్రాసెస్డ్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. తాజా పండ్లు, కూరగాయలు ఆహారంలో చేర్చుకోవాలి.బీపీలో ఎటువంటి అసహజ మార్పులు గమనించినా వెంటనే వైద్యులను సంప్రదించి, తగిన సలహాలు, మందులు వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.
వైఎస్ షర్మిలకు సర్జరీ.. ఐసీయూ నుంచి ఫోటో షేర్ చేసిన ఏపీ కాంగ్రెస్ చీఫ్!
గన్‌తో బెదిరించి ఏటీఎం మిషన్ ఎత్తుకెళ్లిన దొంగలు..
