Homeతెలంగాణకరీంనగర్‌లో ఓటేసిన బండి దంపతులు

కరీంనగర్‌లో ఓటేసిన బండి దంపతులు

  • ఫోన్ ట్యాపింగ్‌పై సీఎం రేవంత్‌కు చిత్తశుద్ది లేదు   
  • కేంద్రమంత్రి బండి సంజయ్

కరీంనగర్,క్రైమ్ మిర్ర‌ర్ః మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా జ్యోతినగర్ ఎస్‌ఆర్ హైస్కూల్లో కుటుంబ సభ్యులతో కలిసి కేంద్రమంత్రి బండి సంజయ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఈసందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ పై సీఎం రేవంత్‌రెడ్డికి చిత్త‌శుద్ది లేద‌ని మండ‌ప‌డ్డారు. ఫోన్ ట్యాపింగ్ ఎవ‌రుచేస్తున్నారో సీఎం స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

కేసీఆర్‌కు రేవంత్ భయపడుతున్నారా? కేసీఆర్ కుటుంబంపై చర్యలు తీసుకోరా? అని మంత్రి ప్రశ్నించారు.ముఖ్య‌మంత్రికి రాజ‌కీయాల మీద ఉన్న శ్ర‌ద్ద రైతుల‌పై లేద‌ని ద్వ‌జ‌మెత్తారు.

కాంగ్రెస్ నేతలు బ్లాక్‌లో యూరియా అమ్ముకుంటున్నారని ఆరోపించారు. కేంద్రాన్ని విమర్శించడం తప్ప రాష్ట్రం ఏం చేస్తోందని ప్రశ్నించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ద్రోహి అంటూ వ్యాఖ్యానించారు. అప్ప‌డు బీఆర్ ఎస్‌లో, ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో రైతులు గోస‌ప‌డుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

 

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు