Homeక్రైమ్సదాశివపేట ప్రభుత్వ ఆస్పత్రి టాయిలెట్‌లో శిశువు మృతదేహం..

సదాశివపేట ప్రభుత్వ ఆస్పత్రి టాయిలెట్‌లో శిశువు మృతదేహం..

సదాశివపేట ప్రభుత్వ ఆస్పత్రిలో విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రి మరుగుదొడ్డిలో గుర్తుతెలియని శిశువు మృతదేహం కనిపించడం స్థానికంగా కలకలం రేపింది.

ఈ ఘటన ఈ నెల 7న జరిగినట్లు తెలుస్తోంది. అయితే విషయం నాలుగు రోజుల తర్వాత బయటకు వచ్చింది. మరుగుదొడ్డిలో శిశువు మృతదేహాన్ని గుర్తించిన డ్యూటీ వైద్యుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అదే రోజు సదాశివపేట పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించినప్పటికీ విషయాన్ని గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. శిశువు మృతదేహం ఆస్పత్రి మరుగుదొడ్డిలోకి ఎలా వచ్చింది? ఎవరు అక్కడ వదిలి వెళ్లారు? శిశువు మృతికి కారణం ఏమిటి? అనే అంశాలపై పోలీసులు విచారణ చేపట్టారు.

ఆస్పత్రిలోని సీసీ కెమెరాల ఫుటేజీ, ఇతర ఆధారాలను పరిశీలించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తు అనంతరం వెల్లడికానున్నాయి.

also read: ఏలూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు