Homeక్రైమ్ఏలూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు

ఏలూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు

ఏలూరు జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జంగారెడ్డిగూడెం–పుట్లగట్లగూడెం గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఆగి ఉన్న లారీని ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.

హైదరాబాద్‌ నుంచి కాకినాడకు ప్రయాణికులతో వెళ్తున్న ఇంటర్సిటీ స్మార్ట్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. హైవేపై నిలిపి ఉన్న లారీని ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ప్రమాదం ధాటికి బస్సు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. బస్సులో ఉన్న సుమారు 30 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహకారంతో క్షతగాత్రులను బస్సు నుంచి బయటకు తీసి జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్‌ నిద్రమత్తు, అతివేగం లేదా హైవేపై లారీని నిలిపిన విధానం కారణమా అనే కోణాల్లో వివరాలు సేకరిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం పోలీసుల దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.

also read: టీడీపీలోకి దగ్గుబాటి వారసుడు.. రాజకీయ అరంగేట్రానికి హితేష్ చెంచురాం సిద్ధం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు