తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ కుటుంబానికి చెందిన పలువురు నేతలు ప్రస్తుతం క్రియాశీలకంగా కొనసాగుతున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, పొలిట్‌బ్యూరో సభ్యుడు నందమూరి బాలకృష్ణతో పాటు సుహాసిని కూడా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.
ఈ క్రమంలో టీడీపీలోకి మరో కీలక కుటుంబానికి చెందిన వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి కుమారుడు హితేష్ చెంచురాం టీడీపీ ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.
గతంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరి దంపతులు టీడీపీకి దూరమై కాంగ్రెస్‌లో కొనసాగారు. అయితే మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు, దగ్గుబాటి కుటుంబాల మధ్య సయోధ్య ఏర్పడినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది.
ఈ నేపథ్యంలో హితేష్ చెంచురాం టీడీపీలో చేరితే పార్టీకి మరో యువ నాయకత్వం అందుబాటులోకి వచ్చినట్లవుతుందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఆయన రాజకీయ ప్రవేశం, పార్టీ కార్యక్రమాల్లో చురుకైన పాత్రపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడాల్సి ఉంది.
also read: మెగా ఫ్యామిలీకి చిరంజీవే ప్రాణవాయువు.. నాగబాబు భావోద్వేగ వ్యాఖ్యలు
