Homeక్రైమ్విజయవాడలో దారుణం.. ఒంటరి మహిళపై ఐదుగురు యువకుల అత్యాచారం

విజయవాడలో దారుణం.. ఒంటరి మహిళపై ఐదుగురు యువకుల అత్యాచారం

విజయవాడ పరిధిలోని నున్నలో మహిళపై సామూహిక అత్యాచారం జరిగినట్లు ఆరోపణలు రావడం కలకలం రేపింది. ఒంటరిగా ఉన్న మహిళను లక్ష్యంగా చేసుకుని మద్యం మత్తులో ఉన్న ఐదుగురు యువకులు ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం.

శనివారం ఈ ఘటనకు సంబంధించిన విషయం స్థానికుల దృష్టికి రావడంతో బాధిత మహిళను వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు సమాచారం.

సమాచారం అందుకున్న నున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటనకు దారితీసిన పరిస్థితులు, నిందితుల పాత్ర తదితర అంశాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

పోలీసుల దర్యాప్తు పూర్తయిన తర్వాత ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

also read:ఉంగరం వివాదం.. దంపతుల ఆత్మహత్యాయత్నం… గోదావరిలో దూకిన భార్యాభర్తలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు