పశ్చిమగోదావరి, క్రైమ్‌మిర్రర్: పశ్చిమగోదావరి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఐదేళ్ల కుమారుడిని గోదావరి ఒడ్డున వదిలి ఓ దంపతులు ఉప్పొంగుతున్న గోదావరి నదిలో దూకినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.వేల్పూరు గ్రామానికి చెందిన దొడ్డా వెంకట ధనసాయికృష్ణ అలియాస్ డీవీడీ (32), అతని భార్య శిరీష (28) కొన్నాళ్లుగా భీమవరంలో నివాసం ఉంటున్నారు. గురువారం రాత్రి వీరు చించినాడ వంతెనపైకి వచ్చి గోదావరి నదిలోకి దూకేశారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు శుక్రవారం రోజంతా నదిలో గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ దంపతుల ఆచూకీ లభించలేదు.
Also Read:ఎమ్మెల్సీ మీర్జా రెహ్మత్ బేగ్‌కు బెదిరింపులు.. డీప్‌ఫేక్ వీడియోల పేరుతో డబ్బుల డిమాండ్
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. చిన్నారిని అదుపులోకి తీసుకుని అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. మరోవైపు దంపతులు నదిలోకి దూకి ఉంటారనే అనుమానంతో గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చేపట్టారు. ప్రస్తుతం గోదావరిలో వరద ప్రవాహం ఉధృతంగా ఉండటంతో గాలింపు చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. అయినప్పటికీ పోలీసులు, రెస్క్యూ సిబ్బంది నదిలో పలు ప్రాంతాల్లో గాలిస్తున్నారు. దంపతులు నిజంగానే నదిలోకి దూకారా? లేక మరేదైనా కారణంతో అదృశ్యమయ్యారా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:షామ్లీలో సింగర్ అంకిత్ పై దారుణ కాల్పులు.. 30 సెకన్లలో 20 రౌండ్లు!
