వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం అనారోగ్యానికి గురైన ఆయనను కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. నగరంలోని అపోలో ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
ఆసుపత్రికి చేరుకున్న వెంటనే వైద్యులు అంబటి రాంబాబుకు పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం యాంజియోగ్రామ్ చేసిన వైద్య బృందం.. అవసరమైన చికిత్సలో భాగంగా స్టెంట్ అమర్చాలని నిర్ణయించింది. వైద్యులు చేపట్టిన ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తయినట్లు సమాచారం.
ప్రస్తుతం అంబటి రాంబాబు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు వెల్లడించినట్లు తెలుస్తోంది.
అంబటి రాంబాబు అస్వస్థతకు గురైన విషయం తెలియడంతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే ఆయన ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉందన్న సమాచారం రావడంతో పార్టీ శ్రేణులు, అభిమానులు ఊరట చెందుతున్నారు.
also read: ‘ది ప్యారడైజ్’ నుంచి మాస్ ట్రీట్.. డల్లాస్‌లో ‘యేష నాగుల’ లైవ్ పెర్ఫార్మెన్స్!
