అమరావతి, క్రైమ్‌మిర్రర్: తమిళనాడు రాష్ర్టంలో అతికిరాతకంగా దుండగులు మహిళను హత్య చేసిన దారుణ ఘటన ఆప్రాంతంలో కలకలం రేపుతోంది. తిరుపతికి చెందిన అరుణ అనే మహిళను గుర్తు తెలియని దుండగులు అతికిరాతకంగా హత్య చేశారు. నిండ్ర మండలానికి చెందిన అరుణ(50) బంధువుల వివాహం కోసం తమిళనాడుకు వెళ్లింది. అయితే తిరువళ్లూరు జిల్లా పొడటూర్ పేట సమీపంలోని ముళ్లపొదల్లో మహిళ శవమై తేలింది. అరుణ ముఖంపై యాసిడ్ పోసి దుండగులు దారుణంగా చంపేశారు. ఆపై ఆమె వద్ద ఉన్న 20 సవర్ల బంగారు నగలను అపహరించారు.
Also Read:ఎమ్మెల్సీ మీర్జా రెహ్మత్ బేగ్‌కు బెదిరింపులు.. డీప్‌ఫేక్ వీడియోల పేరుతో డబ్బుల డిమాండ్
స్థానికుల సమాచారం మేరకు ఉత్తుకోట పోలీసులు సంఘటనా స్థలికి చేరుకున్నారు.ముళ్లపొదల్లో ఉన్న మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మహిళ మృతి సమాచారాన్ని కుటుంబసభ్యులకు తెలియజేశారు. కేసు నమోదు చేసిన ఉత్తుకోట పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మహిళను బంగారు నగల కోసం దోపిడీ దొంగలు హత్య చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. పెళ్లికి వెళ్లిన అరుణ.. దారుణ హత్యకు గురవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Also Read:నేపాల్ వరదల్లో 23 మంది తెలంగాణ వాసుల గల్లంతు…!ఇద్దరు సురక్షితం
