హైదరాబాద్, క్రైమ్‌మిర్రర్: ఒడిశాలో దారుణ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. మయూర్‌భంజ్ జిల్లాలోని ఓ రెసిడెన్షియల్ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న బాలికకు నిర్వహించిన సాధారణ ఆరోగ్య పరీక్షల్లో ఆమె ఐదు నెలల గర్భవతి అని తేలింది. దీంతో తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా అసలు విషయం బయటపడింది. తల్లిదండ్రులకు ఆ బాలిక షాకింగ్ విషయం చెప్పింది. పాఠశాలలో ఈ వారం నిర్వహించిన రొటీన్ మెడికల్ చెకప్‌లో బాలిక ఐదు నెలల గర్భవతి అని గుర్తించారు. వెంటనే స్కూల్ యాజమాన్యం ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించింది. తల్లిదండ్రులు బాలికతో మాట్లాడిన తర్వాత ఆమె వేసవి సెలవుల్లో తనపై జరిగిన లైంగిక దాడి గురించి వెల్లడించింది.
Also Read: షామ్లీలో సింగర్ అంకిత్ పై దారుణ కాల్పులు.. 30 సెకన్లలో 20 రౌండ్లు!
వేసవి సెలవుల్లో బాలిక ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెకు ట్యూషన్ చెప్పేందుకు వచ్చిన ప్రైవేట్ ట్యూటర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బాలికను ఆ ట్యూటర్ బెదిరించాడు.ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, సదరు ప్రైవేట్ ట్యూటర్‌ను శుక్రవారం అరెస్ట్ చేశారు. కేసుపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. బాలికపై జరిగిన ఘటనకు సంబంధించి చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయి.
Also Read: UP Crime: విద్యార్థిపై టీచర్ దాష్టీకం.. 39 సెకన్లలో 17 చెంపదెబ్బలు!
