నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీ మృతి చెందాడు. మౌలాలి (48) అనే ఖైదీ శనివారం అకస్మాత్తుగా మృతి చెందాడు. బ్యారక్‌లో ఉన్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
మౌలాలి కుప్పకూలిన విషయాన్ని తోటి ఖైదీ జైలు సిబ్బందికి తెలియజేశాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అతడిని జైలు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి (GGH) తరలించారు.
అయితే ఆస్పత్రికి చేరుకునే సమయానికే మౌలాలి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై జైలు అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. మౌలాలి మృతికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.
also read: విజయవాడలో దారుణం.. ఒంటరి మహిళపై ఐదుగురు యువకుల అత్యాచారం
