Homeవైరల్“మా దేశాన్ని దూషిస్తావా?” ఇటలీలో వెయిటర్‌కు భారత మహిళల గట్టి సమాధానం.. వీడియో వైరల్

“మా దేశాన్ని దూషిస్తావా?” ఇటలీలో వెయిటర్‌కు భారత మహిళల గట్టి సమాధానం.. వీడియో వైరల్

విదేశాల్లో భారతీయుల గౌరవాన్ని కాపాడేందుకు కొందరు మహిళలు చూపిన ధైర్యం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటలీ పర్యటనలో ఉన్న భారతీయ మహిళల గుంపు, తమ దేశంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓ రెస్టారెంట్ ఉద్యోగిని ధైర్యంగా ఎదుర్కొని, అతడితో బహిరంగంగా క్షమాపణ చెప్పించిన ఘటన విశేష చర్చనీయాంశమైంది.

జూన్ 23న ఇటలీలోని పీసా నగరంలో ఉన్న ఒక ప్రసిద్ధ రెస్టారెంట్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఖుషీ దూబే తన స్నేహితులతో కలిసి అక్కడ భోజనానికి వెళ్లింది. అన్నీ సవ్యంగా సాగుతుండగా, బిల్లు చెల్లించే సమయంలో అక్కడ పనిచేస్తున్న ఓ వెయిటర్‌తో వాగ్వాదం ప్రారంభమైంది.

ఈ వాగ్వాదం సమయంలో ఆ వెయిటర్ భారత్‌ను ఉద్దేశించి అవమానకర వ్యాఖ్యలు చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. దీనిని సహించలేని భారతీయ మహిళలు, అతడిని గట్టిగా ప్రశ్నిస్తూ, “మర్యాదగా మాట్లాడటం నేర్చుకో… మహిళలను గౌరవించడం తెలుసుకో… మా దేశాన్ని దూషించినందుకు క్షమాపణ చెప్పాలి” అంటూ నిలదీశారు.

వివాదం తీవ్రతరంగా మారడంతో వారు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాల మాటలు విని పరిస్థితిని సమీక్షించారు. మహిళలు తమ అభిప్రాయంపై దృఢంగా నిలబడటంతో, చివరకు ఆ వెయిటర్ తన తప్పును అంగీకరించి, భారత్‌పై చేసిన వ్యాఖ్యలపై బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సి వచ్చింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఖుషీ దూబే తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయగా, అది వేగంగా వైరల్‌గా మారింది. పరాయి దేశంలో కూడా తమ దేశ గౌరవాన్ని కాపాడేందుకు ముందుకు వచ్చిన ఈ మహిళల ధైర్యాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ సంఘటన మరోసారి భారతీయులు ఎక్కడ ఉన్నా తమ స్వాభిమానాన్ని కాపాడేందుకు వెనుకాడరని చూపించింది.

also read: బోనీ కపూర్ ఇంట పెళ్లి సందడి.. అన్షులా కపూర్ వెడ్డింగ్ వేడుకలు షురూ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు