Homeఅంతర్జాతీయంPowerful Earthquakes: వెంటవెంటనే రెండు భారీ భూకంపాలు.. చిగురుటాకుల్లా ఊగిన భవనాలు!

Powerful Earthquakes: వెంటవెంటనే రెండు భారీ భూకంపాలు.. చిగురుటాకుల్లా ఊగిన భవనాలు!

Powerful Earthquakes Strike Venezuela: దక్షిణ అమెరికా దేశమైన వెనెజువెలాలో వరుసగా రెండు భారీ భూకంపాలు సంభవించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నిమిషాల వ్యవధిలోనే రెండు సార్లు భూమి కంపించడంతో దేశ రాజధాని కారకాస్ సహా పలు ప్రాంతాల్లో భవనాలు బలంగా ఊగిపోయాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. చాలా మంది సురక్షిత ప్రాంతాలకు వెళ్లి ఆశ్రయం పొందారు.

రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.5గా నమోదు

అమెరికాకు చెందిన యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించిన వివరాల ప్రకారం, తొలి భూకంపం రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రతతో నమోదైంది. ఆ తర్వాత కొద్ది నిమిషాలకే మరో భారీ భూకంపం సంభవించింది. రెండో భూకంపం తీవ్రత 7.5గా నమోదైనట్లు అధికారులు తెలిపారు.

మొదటి భూకంప కేంద్రం వెనెజువెలా కరేబియన్ తీర ప్రాంతంలోని మోరోన్‌కు పశ్చిమాన సుమారు 28 కిలోమీటర్ల దూరంలో, భూమికి 13 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు. వరుస ప్రకంపనల కారణంగా ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ముఖ్యంగా కారకాస్ నగరంలో భవనాలు కంపించడంతో కార్యాలయాలు, అపార్ట్‌మెంట్లలో ఉన్న ప్రజలు బయటకు వచ్చి రోడ్లపై గుమిగూడారు.

శిథిలాల కింద చిక్కుకున్న జనాలు

భూకంపాల కారణంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు అధికారిక సమాచారం వెలువడలేదు. కానీ, పెద్ద పెద్ద భవనాలు కూలిపోయాయి. శిథాలాల కింద పలువురు చిక్కుకుపోయారు. వారిని రెస్క్యూ సిబ్బంది కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా, కమ్యూనికేషన్ వ్యవస్థలపై ప్రభావం పడిందా అనే విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. అయితే, భవనాలు బలంగా ఊగుతున్న దృశ్యాలను పలువురు తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఈ వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. పరిస్థితిని ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు