Homeఆంధ్ర ప్రదేశ్చిన్న శ్రీను కు షాక్...!

చిన్న శ్రీను కు షాక్…!

  • జడ్పిటిసి బరిలో ఆయన కుమార్తె సిరి సహస్ర

  • ఇంతలోనే హైకోర్టు కీలక ఆదేశాలు

  • బీసీ ప్రయోజనాలకు బ్రేక్

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మధ్య శ్రీనివాసరావుకు షాక్ తగిలింది. ఆయన కుమార్తె సిరి సహస్ర బీసీ ధ్రువీకరణ విషయంలో న్యాయస్థానం కీలక ఆదేశాలు ఇచ్చింది. సరిగ్గా రేపు జడ్పిటిసి ఎన్నికల్లో సిరి సహస్ర బరిలో ఉండగా కోర్టు ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది. ఆమె బీసీ కానప్పటికీ రిజర్వేషన్ ప్రయోజనాలు పొందడంతో పాటు ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు వచ్చిన ఆరోపణలపై దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ వివాదం తేలే వరకు ఆమె పొందుతున్న బీసీ రిజర్వేషన్ ప్రయోజనాలను సైతం బ్రేక్ వేసింది. కొద్ది రోజుల కిందట ఆమె తెలుగుదేశం పార్టీలో చేరారు. తన తండ్రి చిన్న శ్రీను తో కలిసి టిడిపిలోకి వెళ్లారు. విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా ఆమెకు అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు. ఇంతలోనే ఈ కోర్టు వివాదం వెంటాడింది.

తెర్లాం జడ్పిటిసి గా బరిలోకి…

సిరి సహస్ర తాజా స్థానిక సంస్థల ఎన్నికల్లో తెర్లాం జడ్పిటిసి గా పోటీ చేస్తున్నారు. అయితే ఆస్థానం అన్ రిజర్వ్డ్ కు కేటాయించారు. అటువంటి చోట ఆమె పోటీ చేస్తున్నారు. గెలిస్తే ఆమెకు విజయనగరం జడ్పీ చైర్పర్సన్ అయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో ఆమె కుల ధ్రువీకరణ పత్రం పై వివాదం తెరపైకి వచ్చింది. ఆమె తల్లి మార్వాడి కావడం.. సిరి సహస్ర అసలు పేరు మస్తాన్ జైన్ కావడంతో.. ఆమె ప్రత్యర్థులు ఇదే విషయాన్ని కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆయన చర్యలు తీసుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిపి ఈరోజు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. ఓసి కులానికి చెందిన సిరి సహస్ర బీసీ సర్టిఫికెట్ తో నామినేషన్ వేసినట్లు వైసిపి అభ్యర్థి బొమ్మి శ్రీనివాసరావు అభ్యంతరం తెలుపుతూ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. ఈ వ్యవహారం పై వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని విజయనగరం జిల్లా కలెక్టర్కు ఆదేశాలు ఇచ్చింది.

అన్ రిజర్వుడ్ స్థానం అయినా…

అయితే ఇప్పటికే తెర్లాం జడ్పిటిసి బరిలో ఆమె ఉన్నారు. రేపే పోలింగ్ జరగనుంది. అయితే అది అన్ రిజర్వుడ్ కు కేటాయించిన జడ్పిటిసి స్థానం. అయితే బీసీ అభ్యర్థిగా ధ్రువీకరణ పత్రం సమర్పించడంతో రేపు పోలింగ్లో ఏం జరుగుతుంది అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే అది ఆన్ రిజర్వు స్థానం కావడం.. అందరికీ పోటీ చేసే అవకాశం ఉండడంతో ఉపశమనం కలిగించే విషయం. కానీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ మాత్రం బీసీ మహిళకు కేటాయించారు. ఆ పదవి సిరి సహస్రకు దక్కుతుందని అంతా భావించారు. కానీ ఎటువంటి బీసీ రిజర్వేషన్లు పొందకూడదని కోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో.. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా ఆమె బరిలో ఉంటారా? హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో సుప్రీంకోర్టు ను ఆశ్రయిస్తారా? అన్నది చూడాలి.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1.  విచారణలో అక్రమాలు నిర్ధారణ.. అయినా చర్యలేవీ?
  2.  దేశభక్తి సినిమాలో ఇలాంటి సాంగ్ అవసరమా? సల్మాన్ ఖాన్ పాటపై దుమారం
  3.  వ‌ర‌ద‌లో చిక్కుకుపోయిన మ‌హిళ‌ల‌ను కాపాడిన సీఐ…! సోష‌ల్ మీడియా వైర‌ల్‌…
  4.  కేటీఆర్‌కు బండి సంజయ్ ఘాటు కౌంటర్

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు