Homeతెలంగాణతెలంగాణ స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం....! అప్రూవ్డ్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ కు లైన్ క్లియర్...

తెలంగాణ స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం….! అప్రూవ్డ్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ కు లైన్ క్లియర్…

  • 22 ఏ, నాన్ నాలా సమస్యకు మోక్షం

  • రాష్ట్రవ్యాప్తంగా 240కి పైగా కాలనీలు, లే అవుట్ లకు విముక్తి

  • తెలంగాణ ప్రభుత్వ సంచలన నిర్ణయం

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓపెన్ ప్లాట్లు, ఇల్లు కొనుగోలు చేసి యాళ్ల తరబడి నిషేధిత జాబితా చిక్కుముడులో పడి.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న లక్షలాదిమంది సామాన్యులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ప్రభుత్వం పోరాటం ఇచ్చింది. దశాబ్దాల క్రితం లేఅవుట్ అనుమతులు పొంది.. నాన్ నాలా నిబంధనలు కలిగిన ఆస్తులు సాంకేతిక లోపాలు, బేస్ సర్వే నంబర్ల బ్లాకింగ్ కారణంగా.. 22 ఏ నిషేధిత జాబితాలో నిలిచిపోవడంతో కొనుగోలుదారులు తీవ్ర నష్టపోయారు. ఈ సమస్యపై సమగ్ర విచారణ చేపట్టిన ప్రభుత్వం.. చట్టబద్ధమైన అనుమతులు ఉన్న నాన్ నాలా ప్లాట్లు, ఇళ్ల క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్లకు ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇది మధ్య తరగతి వారికి నిజంగా శుభవార్త. రెవెన్యూ శాఖ జారీ చేసిన తాజా ఆదేశాల ప్రకారం.. జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ, డిటిసిపి, మున్సిపాలిటీలు, నిబంధనల ప్రకారం అనుమతులు పొందిన అప్రూవుడ్ లేఅవుట్లకు సంబంధించిన ఆస్తులు 22a జాబితాలో ఉన్నప్పటికి వాటి రిజిస్ట్రేషన్ కు అనుమతిస్తారు.

చాలా ప్రాంతాలకు విముక్తి…

లింక్ డాక్యుమెంట్లు, బిల్డింగ్ లేదా లేఅవుట్ అనుమతి పత్రాలు పక్కాగా ఉన్న సందర్భాల్లో నిషేధిత జాబితా ఆంక్షలు వర్తించవు. ఈ నిర్ణయంతో రంగారెడ్డి, మేడ్చల్- మల్కాజిగిరి తో పాటు రాష్ట్రవ్యాప్తంగా 240కి పైగా కాలనీలు, లేఅవుట్లలో చిక్కుకుపోయిన ప్లాట్ లను రిజిస్ట్రేషన్ స్వేచ్ఛ లభించింది. అంతేకాకుండా సాగు భూముల్లో గతంలో చేపట్టిన నిర్మాణాలకు సంబంధించి అర్హమైన నాలా దరఖాస్తుల పరిష్కారానికి కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

డిజిటల్ రిజిస్ట్రేషన్ పత్రాలు…

క్రమబద్ధీకరణకు సైతం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం గమనార్హం. న్యాయవివాదాలు లేని ఆస్తులకు నిర్ణీత నాలా రుసుముతో పాటు పారదర్శక నిబంధనలను వర్తింపజేస్తూ క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేస్తారు. స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దరఖాస్తుల డాక్యుమెంట్లను డిజిటల్ డేటా తో సరిచూసి.. ఆన్లైన్ వెరిఫికేషన్ పూర్తయిన వెంటనే బయోమెట్రిక్ విధానంలో వేగంగా డిజిటల్ రిజిస్ట్రేషన్ పత్రాలను అందజేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఎక్కడైనా క్షేత్రస్థాయి సాంకేతిక ఇబ్బందులు లేదా శాఖల మధ్య వ్యత్యాసాలు ఎదురైతే.. వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు కలెక్టర్ల నేతృత్వంలో ప్రత్యేక జిల్లా స్థాయి కమిటీలను కూడా బాధ్యులుగా నియమించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ సాహసోపేత నిబంధనల సవరణ వల్ల ఏళ్ల తరబడి నిలిచిపోయిన స్థిరాస్తి లావాదేవీలు తిరిగి పుంజుకోవడమే కాకుండా.. మధ్యతరగతి ప్లాట్ల యజమానులకు తమ సొంత ఆస్తులపై పూర్తి హక్కులు దక్కనున్నాయి.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1.  ఏపీలో పరిషత్ పోలింగ్ హంగామా: పలు జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా వాయిదా
  2. తెలంగాణ కాంగ్రెస్‌లో వర్గపోరు: నేతలకు సీరియస్ హెచ్చరికలు జారీ చేసిన పీసీసీ చీఫ్
  3.  సీపీఆర్ ఎందుకు చేయలేదు? పాఠశాల సిబ్బందిని నిలదీసిన తల్లిదండ్రులు
  4. కస్తూర్బా పాఠశాల విద్యార్థిని మృతి.. నలుగురు ఉద్యోగులపై వేటు

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు