Homeసినిమాదేశభక్తి సినిమాలో ఇలాంటి సాంగ్ అవసరమా? సల్మాన్ ఖాన్ పాటపై దుమారం..

దేశభక్తి సినిమాలో ఇలాంటి సాంగ్ అవసరమా? సల్మాన్ ఖాన్ పాటపై దుమారం..

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్’ విడుదలకు ముందే వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాలో సల్మాన్ స్వయంగా ఆలపించిన ఓ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. దేశభక్తి, సైనికుల త్యాగాల నేపథ్యంలో రూపొందుతున్న చిత్రంలో ‘తేరీ సెక్సీ బ్యూటీ’ అంటూ సాగే పాటను చేర్చడంపై నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

దాదాపు 11 ఏళ్ల విరామం తర్వాత సల్మాన్ ఖాన్ మరోసారి తన గాత్రాన్ని వినిపించడం ఈ పాటతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నవంబర్ 4న విడుదలైన ఈ గీతంలో సల్మాన్‌తో పాటు నటి చిత్రాంగద సింగ్ కనిపించారు. ముస్కాన్‌తో కలిసి సల్మాన్ ఈ పాటను ఆలపించారు. అయితే పాటలోని పదాలు మాత్రం ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనను అందుకుంటున్నాయి.

ముఖ్యంగా 2020లో జరిగిన గల్వాన్ లోయ ఘర్షణలో భారత సైనికులు ప్రాణత్యాగం చేసిన ఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందుతుండటంతో విమర్శలు మరింత పెరిగాయి. అమరవీరుల త్యాగాలను గుర్తుచేసే కథాంశంతో తెరకెక్కుతున్న సినిమాలో గ్లామర్, వినోదానికి సంబంధించిన ఇలాంటి సాహిత్యం ఎందుకంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.

పాట విడుదలైన వెంటనే ఎక్స్ వేదికగా నెటిజన్లు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. గల్వాన్ ఘటనలో కల్నల్ సంతోష్ బాబుతో పాటు 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని గుర్తుచేస్తూ, వారి త్యాగాలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందని కొందరు అభిప్రాయపడ్డారు. దేశభక్తి నేపథ్యంలో రూపొందుతున్న సినిమాలో పాట ఎంపిక విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిందని విమర్శించారు.

మరికొందరు సల్మాన్ ఖాన్ నటన, గాత్రం, పాటలోని సాహిత్యంపై సెటైర్లు వేస్తున్నారు. గతంలో ఉన్న క్రేజ్‌ను నిలబెట్టుకోవాలంటే సినిమాల ఎంపిక, కంటెంట్ విషయంలో జాగ్రత్త అవసరమంటూ కామెంట్లు చేస్తున్నారు.

అయితే సల్మాన్ అభిమానులు మాత్రం ఈ పాటకు మద్దతుగా నిలుస్తున్నారు. పాట ట్యూన్ ఆకట్టుకునేలా ఉందని, చాలా కాలం తర్వాత ఆయన పాట పాడటం ఆనందంగా ఉందని పేర్కొంటున్నారు. దీంతో ఈ పాటపై సోషల్ మీడియాలో అనుకూల, ప్రతికూల చర్చ కొనసాగుతోంది.

ఇక ఈ సినిమాను తొలుత ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ పేరుతో ప్రకటించారు. ఇందులో సల్మాన్ ఖాన్ భారత సైనిక అధికారిగా కనిపించనుండగా, ఆయన భార్య పాత్రలో చిత్రాంగద సింగ్ నటిస్తున్నారు. ఇప్పటికే పాటతో వార్తల్లో నిలిచిన ఈ చిత్రం, ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలి.

also read: వ‌ర‌ద‌లో చిక్కుకుపోయిన మ‌హిళ‌ల‌ను కాపాడిన సీఐ…! సోష‌ల్ మీడియా వైర‌ల్‌…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు