Homeఆంధ్ర ప్రదేశ్వ‌ర‌ద‌లో చిక్కుకుపోయిన మ‌హిళ‌ల‌ను కాపాడిన సీఐ...! సోష‌ల్ మీడియా వైర‌ల్‌...

వ‌ర‌ద‌లో చిక్కుకుపోయిన మ‌హిళ‌ల‌ను కాపాడిన సీఐ…! సోష‌ల్ మీడియా వైర‌ల్‌…

  • నడుముకు తాడు కట్టి వరదలో దిగి కాపాడిన సర్కిల్ ఇన్స్పెక్టర్

  • సోషల్ మీడియాలో వీడియోలు

  • అభినందనల వెల్లువ

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఏపీలో మురసు తుఫాన్ ప్రభావం చూపుతోంది. ప్రధానంగా కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఏకధాటిగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. దీంతో రహదారులపై పెద్ద ఎత్తున నీరు చేరుతోంది. వాగులు వంకలు, పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో చిలకలూరిపేటలో ఓ చోట భారీగా వరద నీరు చేరింది. అందులో ముగ్గురు మహిళలు చిక్కుకుపోయారు. వరద ప్రవాహం ఉధృతంగా ఉండడంతో వారు బయటకు రాలేకపోయారు. దీంతో చిలకలూరిపేట సిఐ సుబ్బానాయుడు తన సిబ్బందితో కలిసి వరద నీటిలోకి దూకి రక్షించారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారుతోంది. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. సీఐతో పాటు పోలీస్ సిబ్బంది సాహసాన్ని అందరూ అభినందిస్తున్నారు.

పరిస్థితి ఆందోళనకరం…

తుఫాన్ విరుచుకుపడుతుండడంతో చిలకలూరిపేట పట్టణం పరిస్థితి చాలా ఆందోళనకరంగా మారింది. అక్కడ నేషనల్ హైవేపై భారీగా వరద నీరు ముంచేత్తింది. విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఎడతెరిపి లేని వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో తిమ్మాపురం అండర్పాస్ దగ్గర వరద నీరు భారీగా చేరింది. ఆ వరద నీటిలో ముగ్గురు మహిళలు చిక్కుకుపోయారు. వరద ప్రవాహం ఉధృతంగా ఉండడంతో వారు బయటకు రాలేక ఆహాకారాలు చేశారు. స్థానికులు గమనించినప్పటికీ వరద ఉధృతిని చూసి ఎవరు సాహసించలేకపోయారు. అయితే ఈ విషయం చిలకలూరిపేట పోలీస్ స్టేషన్ కు చేరింది. వెంటనే సిఐ సుబ్బానాయుడు తన సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు. మహిళలను కాపాడే ప్రయత్నం చేశారు.

ఏమాత్రం ఆలోచించకుండా…

ఎదురుగా భారీగా వరద ఉధృతి ఉంది. అందులో మహిళలు కొట్టుకుపోయే అవకాశం ఉంది. అందుకే క్షణం ఆలోచించకుండా ఒక తాడును తన నడుముకు గట్టిగా కట్టుకొని.. తాడు రెండోకొనను ఒడ్డున ఉన్న స్థానికులకు, సిబ్బందికి పట్టుకోమని చెప్పి ఉధృతంగా ప్రవహిస్తున్న వరదనీటిలోకి దూకారు సీఐ. ఆ ప్రవాహాన్ని ఎదురొడ్డి ఈదుకుంటూ వెళ్లి.. ప్రాణభయంతో ఉన్న ఆ ముగ్గురు మహిళలను అదే తాడు సాయంతో ఒడ్డుకు చేర్చారు. సీఐ చేసిన ఈ పనిపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి మహిళలను రక్షించిన సిఐ సుబ్బానాయుడు ధైర్య సాహసాల పై ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసు ఉన్నతాధికారులతో పాటు స్థానికులు ఆయన అంకితభావానికి హాట్సాఫ్ చెబుతున్నారు.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1.  అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్ సూపర్.. టెస్ట్ లోకి తీసుకోవాలి : గవాస్కార్
  2.  రాప్తాడు ఘటన.. బాలికకు సర్జరీ పై లోకేష్ కీలక ప్రకటన!
  3.  జియో అదిరిపోయే బంపర్ ఆఫర్
  4.  రికార్డుల వేటగాడు, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ బర్త్డే స్పెషల్!

 

 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు