Homeతెలంగాణఆ 45 ఎకరాలు ఎక్కడ..?!

ఆ 45 ఎకరాలు ఎక్కడ..?!

  • కెసిఆర్ ఫామ్ హౌస్ కేసులో కొత్త కోణం

  • సర్వేలో అధికారులు గుర్తించిన వైనం

  • మొత్తం కుటుంబమంతా భూపత్రాలతో హాజరుకావాలని నోటీసులు ఇచ్చే అవకాశం

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: గులాబీ పార్టీకి ఊపిరి ఆడడం లేదు. ముఖ్యంగా కేసీఆర్ ఫామ్ హౌస్ చుట్టూ తిరుగుతున్న వివాదం నిద్ర పట్టనివ్వడం లేదు. తెలంగాణ రాజకీయాల్లో ఏదో రసవత్తర మలుపు. కెసిఆర్ ఫామ్ హౌస్ కేంద్రంగా ప్రభుత్వం చేస్తున్న ఎత్తుగడలు గులాబీ శిబిరంలో కలకలం రేపుతున్నాయి.

రికార్డుల ప్రకారం సర్వే నంబర్ 325లో మొత్తం 38 ఎకరాల ప్రభుత్వ అసైన్డ్ భూమి ఉండాలి. రెవెన్యూ అధికారుల క్షేత్రస్థాయిలో జరిపిన సర్వేలో మాత్రం కేవలం 343 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు తేలింది.

దీంతో కనిపించకుండా పోయిన మిగిలిన 45 ఎకరాల భూమి ఎటు పోయింది? అది కెసిఆర్ ఫామ్ హౌస్ హద్దుల్లోకి కలిసిపోయిందా? ఈ వ్యత్యాసాన్ని నిగ్గు తేల్చేందుకు నేరుగా మాజీ సీఎం కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు తమ వద్ద ఉన్న భూమి పత్రాలతో సహా హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధపడుతోంది. ఇది తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనమే.

  • అంతా వ్యూహం ప్రకారమే..

ఒక వ్యూహం ప్రకారం రేవంత్ రెడ్డి సర్కార్ అడుగులు వేస్తోంది. ఇప్పటికే ధరణి, భూ రికార్డుల అక్రమాలపై ప్రత్యేక నివేదికలు తెప్పించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఆ 45 ఎకరాలు ఎక్కడున్నాయో తేల్చాలని ఆదేశించడమే కాకుండా.. అక్కడ అమరవీరుల కాలనీ నిర్మిస్తామని ప్రకటించి.. ఈ అంశాన్ని రాజకీయ, భావోద్వేగ రంగు పులిమారు.

కేవలం కాగితాల పరిశీలనకే పరిమితం కాకుండా.. మొత్తం ఫామ్ హౌస్ కాంపౌండ్ లోపల సమగ్ర కొలతలు వేయించేందుకు రెవెన్యూ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటివరకు బయట నుంచి సాగిన మాటల యుద్ధం.. ఇప్పుడు ఏకంగా కెసిఆర్ వ్యక్తిగత స్థావరం, వ్యవసాయ ఎస్టేట్ గేట్లు దాటి లోపలికి ప్రవేశించే పరిస్థితి కనిపిస్తోంది.

  • అదే జరిగితే రచ్చే..

ప్రధానంగా ఆ 45 ఎకరాల ప్రభుత్వ భూమి ఫామ్ హౌస్ ఫెన్సింగ్ లోపల.. అందులోనూ ఎస్టేట్ నడిబొడ్డున ఉందని సర్వేలో తేలితే జరిగే రాజకీయ రచ్చ ఊహకు అందదు. ఒకవేళ ఆ భూమిని స్వాధీనం చేసుకోవాల్సి వస్తే.. పచ్చటి ఫార్మ్ హౌస్ కాంపౌండ్ మధ్యలో ప్రభుత్వ కంచెలు వేయడం, స్వాధీనం పేరుతో మార్కింగ్ లు చేయడం అనివార్యంగా మారుతుంది.

దశాబ్ద కాలం పాటు రాష్ట్రాన్ని శాసించిన ఒక తిరుగులేని నేత ఇంటి ప్రాంగణంలోనే రెవెన్యూ సర్వే జరగడం, దానికి పోలీస్ పహారా తోడు కావడం వంటి పరిణామాలు అస్సలు ఊహించినవి. మున్మందు తెలంగాణ పొలిటికల్స్ లో హై వోల్టేజ్ సర్కస్ నడవడం ఖాయం. గులాబీ పార్టీకి ఇది అత్యంత క్లిష్టమైన రాజకీయ సవాల్

అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతలపై ఏ తరహా వ్యూహాలు అమలు చేశారో.. ఇప్పుడు అంతకంటే రెట్టింపు తీవ్రతతో రేవంత్ యంత్రాంగం కేసీఆర్ కంచుకోట చుట్టూ ఉచ్చు బిగిస్తోంది.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు