అక్కినేని నాగచైతన్య తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను తాజాగా వెల్లడించారు. కార్తీక్ దండు దర్శకత్వంలో ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘వృషకర్మ’ డిసెంబరు 4న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చైతన్య తన కెరీర్‌తో పాటు వైవాహిక జీవితం గురించి కూడా మాట్లాడారు.
ముఖ్యంగా తన స్టైల్, ఫ్యాషన్ సెన్స్‌లో వచ్చిన మార్పుల వెనుక శోభిత ధూళిపాళ్ల ఉన్నారని చైతన్య తెలిపారు. తన దుస్తుల ఎంపిక నుంచి వార్డ్‌రోబ్‌లో మార్పుల వరకు శోభిత ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని చెప్పారు. తన లుక్‌ను మరింత మెరుగుపరిచే విషయంలో ఆమె సూచనలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని వెల్లడించారు.
అంతేకాదు, జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవడం విషయంలోనూ శోభిత నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చైతన్య పేర్కొన్నారు. ఆమె ఆలోచనా విధానం, పరిస్థితులను అర్థం చేసుకునే తీరు తనకు ఎంతో స్ఫూర్తినిస్తాయని చెప్పారు.
ఈ సందర్భంగా శోభితపై తనకున్న అభిమానాన్ని, ప్రేమను చైతన్య మాటల్లో వ్యక్తం చేశారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. సాధారణంగా వ్యక్తిగత విషయాలపై ఎక్కువగా మాట్లాడని నాగచైతన్య.. ఈసారి తన జీవిత భాగస్వామి గురించి మనసు విప్పి మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు ‘వృషకర్మ’ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబరు 4న విడుదల కానుండటంతో చిత్రబృందం ప్రమోషన్లను వేగవంతం చేసింది.
also read: హైదరాబాద్‌లో బాంబు పేలుళ్లకు కుట్ర? 26/11 తరహా దాడులంటూ పోలీసులకు బెదిరింపు మెయిల్
