తమిళనాడులో దారుణ హత్య ఘటన తీవ్ర కలకలం రేపింది. ఇతర అబ్బాయిలతో మాట్లాడుతోందనే అనుమానంతో ఓ యువకుడు 16 ఏళ్ల బాలికను హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. తూత్తుకుడి జిల్లాలో శనివారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం.. ముత్తురాజా అనే యువకుడు.. బాలిక ఇతర అబ్బాయిలతో మాట్లాడుతోందనే అనుమానంతో ఆమెపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. తొలుత గొంతు నులిమి, అనంతరం కత్తితో పొడిచి హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
బాలికను హత్య చేసిన అనంతరం ముత్తురాజా కూడా ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు సమాచారం. ఈ ప్రయత్నంలో అతడు తీవ్రంగా గాయపడటంతో స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. మరోవైపు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
మృతిచెందిన బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూత్తుకుడి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్యకు దారితీసిన పూర్తి కారణాలు, ఘటనకు సంబంధించిన ఇతర వివరాలను తెలుసుకునేందుకు విచారణ కొనసాగిస్తున్నారు.
also read: అనుమానంతో దారుణం.. ప్రియురాలికి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మహిళ మృతి
