Homeసినిమాటైగర్ ష్రాఫ్ కారుపై కాల్పుల ఘటన.. బాలీవుడ్ ప్రముఖులకు ముంబై పోలీసుల కీలక హెచ్చరిక!

టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పుల ఘటన.. బాలీవుడ్ ప్రముఖులకు ముంబై పోలీసుల కీలక హెచ్చరిక!

బాలీవుడ్‌లో ప్రముఖుల భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై జరిగిన కాల్పుల ఘటన నేపథ్యంలో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు. సినీ రంగానికి చెందిన ప్రముఖులు బహిరంగ ప్రదేశాల్లో పర్యటించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా జనసమూహాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలకు వెళ్లడం, అభిమానులతో పెద్ద సంఖ్యలో ప్రజల మధ్య కలవడం వంటి సందర్భాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.

ప్రముఖుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ సూచనలు జారీ చేసినట్లు ఓ సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు.

కొన్ని వారాల క్రితం ముంబైలో టైగర్ ష్రాఫ్ ప్రయాణిస్తున్న కారుపై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో సినీ పరిశ్రమలో కలకలం రేగింది. ఆ తర్వాత పలువురు బాలీవుడ్ ప్రముఖుల నివాసాల వద్ద అనుమానిత వ్యక్తులు రెక్కీ నిర్వహించినట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు మరింత అప్రమత్తమై సినీ ప్రముఖులకు భద్రతాపరమైన మార్గదర్శకాలు జారీ చేశారు.

ఇదిలా ఉండగా, ఇటీవల బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన ముంబైలోని జుహు నివాసం ‘జల్సా’ వెలుపల అభిమానులకు అభివాదం చేశారు. అయితే ఈసారి ఆయన బుల్లెట్ ప్రూఫ్ అద్దం వెనుక ఉండి అభిమానులకు అభివాదం చేయడం ప్రత్యేకంగా చర్చనీయాంశమైంది.

మరోవైపు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధాలు ఉన్నాయని చెప్పుకుంటున్న కొందరి నుంచి పలువురు బాలీవుడ్ ప్రముఖులకు బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. వరుస భద్రతా ఆందోళనల నేపథ్యంలో నటీనటులు తమ పర్యటనలు, బహిరంగ కార్యక్రమాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని పోలీసులు సూచించారు.

also read: పోలీస్ స్టేషన్ పక్కనే భారీ చోరీ.. జువెలరీ షాపులో రూ.60 లక్షల విలువైన నగలు మాయం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు