పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సుమారు 13 ఏళ్ల క్రితం నమోదైన ఓ పాత కేసుకు సంబంధించి సాక్షిగా విచారణకు హాజరుకావాలని పోలీసులు ఆమెను కోరారు.
ఈ మేరకు మమతా బెనర్జీకి నోటీసులు పంపినట్లు సమాచారం. అయితే విచారణకు హాజరయ్యే విషయంలో ఆమెకు కొంత వెసులుబాటు కల్పించారు. తనకు అనుకూలమైన తేదీతో పాటు విచారణ జరిగే స్థలాన్ని కూడా సూచించవచ్చని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
పాత కేసులో సాక్షిగా ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసుకునేందుకు ఢిల్లీ పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. అయితే మమతా బెనర్జీ ఎప్పుడు, ఎక్కడ విచారణకు హాజరవుతారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ నోటీసుల వ్యవహారం ప్రస్తుతం రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.
also read: ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలపై అసంతృప్తి.. 135 మంది డాక్టర్లకు షోకాజ్ నోటీసులు!
