Homeక్రైమ్బ్యాంకాక్ నుంచి పుణెకు డ్రగ్స్ స్మగ్లింగ్.. రూ.3.72 కోట్ల విలువైన గంజాయి పట్టివేత!

బ్యాంకాక్ నుంచి పుణెకు డ్రగ్స్ స్మగ్లింగ్.. రూ.3.72 కోట్ల విలువైన గంజాయి పట్టివేత!

విదేశాల నుంచి అక్రమంగా మాదకద్రవ్యాలను తరలిస్తున్న ఘటనను కస్టమ్స్ అధికారులు గుర్తించారు. బ్యాంకాక్ నుంచి పుణెకు వచ్చిన ఓ భారతీయ ప్రయాణికుడి లగేజీలో భారీ మొత్తంలో హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో సుమారు రూ.3.72 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

వివరాల్లోకి వెళ్తే.. సదరు ప్రయాణికుడి చెక్‌-ఇన్ బ్యాగేజీని తనిఖీ చేసిన కస్టమ్స్ అధికారులకు అనుమానాస్పద ప్యాకెట్లు కనిపించాయి. వాటిని పరిశీలించగా మొత్తం 10.642 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి బయటపడింది. డ్రగ్స్‌ను తొమ్మిది వాక్యూమ్ సీల్డ్ ప్యాకెట్లలో అత్యంత జాగ్రత్తగా దాచినట్లు గుర్తించారు.

అధికారుల తనిఖీల్లో మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. మాదకద్రవ్యాలను ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు వాటిపై ‘ఫ్రీజ్ డ్రైడ్ మోంథాంగ్ దురియన్’ అనే లేబుల్స్ అతికించారు. అంతేకాకుండా నూడుల్స్ ప్యాకెట్లు, ఇతర ఆహార పదార్థాల మధ్య వాటిని ఉంచి తరలించే ప్రయత్నం చేశారు.

ఈ వ్యవహారంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు ఎన్డీపీఎస్ (NDPS) చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని నవంబర్ 18 వరకు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. విదేశాల నుంచి జరుగుతున్న డ్రగ్స్ అక్రమ రవాణాపై అధికారులు నిఘా కొనసాగిస్తున్నారు.

also read: ఛార్జింగ్‌లో ఉన్న ఎలక్ట్రిక్ కాంటా తాకి 10 నెలల చిన్నారి మృతి.. జగిత్యాలలో విషాదం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు