Homeక్రైమ్కెనాల్‌లో యువతి మొండెం: గాలింపులో ఒక్కొక్కటిగా లభిస్తున్న శరీర భాగాలు

కెనాల్‌లో యువతి మొండెం: గాలింపులో ఒక్కొక్కటిగా లభిస్తున్న శరీర భాగాలు

నగర పరిధిలోని ఇబ్రహీంపట్నం వీటీపీఎస్ కెనాల్‌లో గుర్తుతెలియని యువతికి చెందిన మొండెం బయటపడటం తీవ్ర కలకలం రేపింది. యువతిని హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా నరికి కెనాల్‌లో పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

కెనాల్‌లో లభించిన శరీర భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. శరీర భాగాల పరిస్థితిని బట్టి సుమారు మూడు రోజుల క్రితమే హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. హత్యకు గురైన యువతి ఎవరనే విషయాన్ని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఆమెను హత్య చేయడానికి గల కారణాలు, నిందితుల వివరాలను తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

కెనాల్ పరిసరాల్లోని సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. అనుమానాస్పదంగా సంచరించిన వ్యక్తులు, వాహనాల వివరాలను సేకరిస్తూ కేసును ఛేదించేందుకు దర్యాప్తును ముమ్మరం చేశారు.

also read: కాకినాడ పోర్టు నుంచి మహారాష్ట్రకు తొలిసారి రైలులో కలప గుజ్జు.. భారీ ఆదాయం వైపు రైల్వే

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు