ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ పోర్టు నుంచి మహారాష్ట్రలోని భిగ్వాన్‌కు కలప గుజ్జును తొలిసారిగా రైలుమార్గం ద్వారా తరలించారు. ఇప్పటివరకు ఈ సరుకును సుమారు 1,061 కిలోమీటర్ల దూరానికి రోడ్డు మార్గంలోనే రవాణా చేస్తున్నారు. అయితే రోడ్డు రవాణాకు ప్రత్యామ్నాయంగా రైల్వేను వినియోగించేలా అధికారులు చర్యలు చేపట్టారు.
కలప గుజ్జు రవాణాను రైల్వే పరిధిలోకి తీసుకురావడంలో భాగంగా గూడ్స్ టారిఫ్ క్లాస్-110లో దీనిని చేర్చారు. దీంతో రైలు ద్వారా సరుకు తరలించే ఖర్చు తగ్గింది. రవాణా వ్యయం తగ్గడంతో పరిశ్రమలు కూడా రైలుమార్గాన్ని ఉపయోగించేందుకు ఆసక్తి చూపుతున్నాయి.
ఒక్క రేక్ ద్వారా రైల్వేకు దాదాపు రూ.40 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే విధంగా ఏడాదికి సుమారు 1.5 లక్షల టన్నుల అదనపు సరుకును రైళ్ల ద్వారా తరలించగలిగితే, రైల్వేకు దాదాపు రూ.20 కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉందని భావిస్తున్నారు.
రోడ్డు రవాణా నుంచి రైలు రవాణాకు కలప గుజ్జును మళ్లించడం ద్వారా పరిశ్రమలకు రవాణా వ్యయం తగ్గడంతో పాటు రైల్వేకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఏర్పడింది. ఈ ప్రయోగం విజయవంతమైతే భవిష్యత్‌లో మరింత సరుకును రైలుమార్గం ద్వారా తరలించే అవకాశాలు పెరగనున్నాయి.
also read: డ్రాగన్ షూటింగ్‌పై ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. అక్టోబర్ నుంచి భారీ షెడ్యూల్!
