Homeక్రైమ్గుంటూరులో మోసగాళ్ల వల.. నకిలీ బంగారు చైన్ చూపించి రూ.20 వేల కాజేత

గుంటూరులో మోసగాళ్ల వల.. నకిలీ బంగారు చైన్ చూపించి రూ.20 వేల కాజేత

గుంటూరు జిల్లాలో ఆసుపత్రికి వచ్చిన ఓ వ్యక్తిని ఇద్దరు వ్యక్తులు మోసం చేసి నగదు తీసుకుని పరారైన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లాకు చెందిన బ్రహ్మయ్య ఈ నెల 18న గుంటూరులోని ఓ స్కిన్‌ స్పెషలిస్ట్‌ను సంప్రదించేందుకు ఆసుపత్రికి వచ్చారు.

అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు బ్రహ్మయ్యను పరిచయం చేసుకుని.. రూ.లక్ష విలువైన బంగారు చైన్‌ను తక్కువ ధరకే ఇస్తామని నమ్మించినట్లు తెలుస్తోంది. వారి మాటలు నమ్మిన బ్రహ్మయ్య రూ.20 వేలు వారికి అందించారు. అనంతరం ఇద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఆ తర్వాత వారు ఇచ్చిన చైన్‌ను పరిశీలించగా అది నకిలీదని తేలింది. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బ్రహ్మయ్య పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆసుపత్రి పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. వాటి ఆధారంగా నిందితులను గుర్తించి పట్టుకునేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

also read: లోహగఢ్‌ కోటపై వ్యాపారవేత్త మృతి.. ప్రమాదం కాదు హత్యే! 5,053 పేజీల ఛార్జ్‌షీట్‌ దాఖలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు