వరంగల్ 16వ డివిజన్ పరిధిలోని గరీబ్‌నగర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల మధ్య చోటుచేసుకున్న వివాదం అన్నదమ్ముల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో ప్రసాద్ తన తమ్ముడు ప్రవీణ్‌పై కత్తితో దాడి చేసినట్లు సమాచారం.
ఈ దాడిలో ప్రవీణ్ తీవ్రంగా గాయపడ్డాడు. పరిస్థితి విషమించడంతో అతడు మృతి చెందినట్లు తెలిసింది. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రవీణ్ మృతికి దారితీసిన పరిస్థితులు, అన్నదమ్ముల మధ్య జరిగిన వివాదానికి అసలు కారణాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
also read: గుంటూరులో మోసగాళ్ల వల.. నకిలీ బంగారు చైన్ చూపించి రూ.20 వేల కాజేత
