Homeక్రైమ్గుడివాడలో దారుణం.. మద్యం మత్తులో ఘర్షణ, వ్యక్తి మృతి

గుడివాడలో దారుణం.. మద్యం మత్తులో ఘర్షణ, వ్యక్తి మృతి

కృష్ణా జిల్లా గుడివాడలో ఆదివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. శోభన కాంప్లెక్స్ సమీపంలో మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. గుడ్‌మెన్‌పేటకు చెందిన నాగరాజు (40) ఈ ఘటనలో మృతి చెందినట్లు సమాచారం.

మద్యం సేవించిన సమయంలో నాగరాజుకు మరో వ్యక్తితో వివాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఘర్షణ తీవ్రరూపం దాల్చడంతో నాగరాజుపై దాడి జరిగినట్లు సమాచారం. తీవ్ర గాయాలతో ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది.

ఘటన అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టడంతో పాటు ఘటనకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నారు.

also read: కాకినాడ పోర్టు నుంచి మహారాష్ట్రకు తొలిసారి రైలులో కలప గుజ్జు.. భారీ ఆదాయం వైపు రైల్వే

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు