Homeఆంధ్ర ప్రదేశ్మహిళ కడుపులో 14 పెన్నులు.. స్కానింగ్‌లో షాకింగ్ విషయం!

మహిళ కడుపులో 14 పెన్నులు.. స్కానింగ్‌లో షాకింగ్ విషయం!

క్రైమ్ మిర్రర్ : ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో ఓ వింత వైద్య ఘటన వెలుగులోకి వచ్చింది. నరసరావుపేటకు చెందిన ఓ మహిళ తీవ్ర కడుపునొప్పితో బాధపడుతూ ఆస్పత్రికి వెళ్లగా.. వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. కుటుంబ సభ్యులు ఆమెను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు స్కానింగ్‌ నిర్వహించగా.. మహిళ కడుపులో పలు అనుమానాస్పద వస్తువులు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం పరీక్షల్లో 14 పెన్నులు, 5 చెక్క స్పూన్లు, ఒక క్యాండిల్ ఉన్నట్లు నిర్ధారించారు.

వైద్యులు వెంటనే లాపరోస్కోపీ విధానంలో శస్త్రచికిత్స నిర్వహించి కడుపులో ఉన్న వస్తువులను బయటకు తీశారు. ఆపరేషన్‌ విజయవంతంగా పూర్తయిందని, ప్రస్తుతం మహిళ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. అయితే ఇన్ని వస్తువులు ఆమె కడుపులోకి ఎలా వెళ్లాయన్నది ప్రస్తుతం ప్రశ్నగా మారింది. మహిళ స్వయంగా వాటిని మింగిందా? లేదా మరెవరైనా బలవంతంగా తినిపించారా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ ఆమె స్వయంగా ఈ వస్తువులను మింగినట్లు తేలితే.. అందుకు దారితీసిన కారణాలపై కూడా వైద్యపరంగా పరిశీలన అవసరమని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. మహిళ కడుపులో నుంచి ఇన్ని వస్తువులను తొలగించడం వైద్య సిబ్బందిని సైతం ఆశ్చర్యానికి గురిచేసింది.
also read : రూ.6 లక్షల అప్పు కోసం దారుణం.. ఫైనాన్స్ సంస్థ మేనేజర్ హత్య

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు