నగరంలో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం విషాదాన్ని నింపింది. కొమ్మాది జంక్షన్ సమీపంలోని ఓ పెట్రోల్ బంక్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన నిలబడి ఉన్న ఓ వృద్ధుడిని బస్సు ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
స్థానికుల వివరాల ప్రకారం.. మధురవాడ నుంచి ఆనందపురం వైపు బస్సు వెళ్తుండగా కొమ్మాది జంక్షన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. పెట్రోల్ బంక్ వద్ద రోడ్డు పక్కన ఉన్న వృద్ధుడిని బస్సు ఢీకొట్టింది. తీవ్ర గాయాల కారణంగా ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
ప్రమాదంపై సమాచారం అందుకున్న పీఎం పాలెం పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి, ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
also read: గోదావరిలో దూకిన దంపతుల కేసు: దొడ్డసాయి మృతదేహం లభ్యం… శిరీష ఆచూకీ కోసం గాలింపు
